తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ షురూ
posted on Nov 30, 2023 5:34AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 119 నియోజకవర్గాలలోనూ గురువారం (నవంబర్ 30) ఉదయం ఏడుగంటల నుంచి పోలింగ్ ఆరంభమైంది. బుధవారం (నవంబర్ 29)సాయంత్రానికే ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు.ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఈ సారి ఎన్నికల బరిలో 2,290 నిలిచారు. తమ ఓటు ద్వారి 3 కోట్ల 26లక్షల మంది ఆ అభ్యర్థుల భవితవ్వాన్ని తేల్చనున్నారు.
మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3.26 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. నవంబర్ 3 నుంచి ప్రారంభమైన ఎన్నికల హడావుడి గురువారం (నవంబర్ 30) సాయంత్రం అయిదు గంటలకు పూర్తవుతుంది. ఇప్పటికే పోలింగ్ పూర్తయిన నాలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబరు 3(ఆదివారం) జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వస్తాయి.
ఇక పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బందో బస్తుకు 75 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. తీవ్రవాద ప్రభావిత 13 అసెంబ్లీ నియోజకవర్గాలు, 12,311 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఇలా గుర్తించిన సిర్పూరు, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే జరుగుతుంది. ఇక పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు 3,800 మంది సెక్టార్ ఆఫీసర్లు, 22 వేల మంది మైక్రో అబ్దర్వర్లను ఎన్నికల సంఘం నియమించింది.
రాష్ట్రంలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 7,32,560 మంది ఓటర్లు ఉండగా, భద్రాచలంలోఅతి తక్కువగా 1,48,713 మంది ఓటర్లు ఉన్నారు. కాగా ఇక ఎల్బీనగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 48 మంది అభ్యర్థులు పోటీలోఉంటే బాన్సువాడ, నారాయణపేట నియోజకవర్గాల్లో ఏడుగురు చొప్పున పోటీ చేస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 638 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా భద్రాచలంలో 176 ఏర్పాటు చేశారు.