TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ సొంత ఊరు బలపనూరు: అక్కడా వైసీపీకి ఎదురుగాలే.!

Published on: Fri Nov 27, 2026 1:46PM

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో  కూడా తెలుగుదేశం కూటమి తిరుగులేని ఆధిపత్యాన్ని చాటింది. మున్సిపల్ ఎన్నికల నుంచి మొదలైన విజయ పరంపర పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అధినేత   జగన్ సొంత జిల్లా, మున్సిపాలిటీ, మండలాలతో పాటుగా పంచాయతీని కూడా టీడీపీ కైవసం చేసుకుంది.

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలోని బలపనూరు పంచాయతీ గత నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి, వైసీసీకి కంచుకోటగా నిలుస్తూ వచ్చింది. అలాంటి బలపనూరులో తొలిసారిగా  ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించి ఆధిపత్యం చాటింది. 

బలపనూరు పంచాయతీలో మొత్తం 2,269 మంది ఓటర్లు ఉన్నారు. సర్పంచి పదవికి టీడీపీ బలపరిచిన కొత్తరెడ్డి అనిల్‌కుమార్‌రెడ్డి  నామినేషన్ దాఖలు చేశారు. అయితే వైసీపీ తరఫున ఎవరూ బరిలోకి దిగకపోవడంతో బలపనూరులో ఎన్నిక ఏకగ్రీవమైంది.

ఈ నెల 1న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జగన్ తన మేనత్త వైఎస్ ప్రమీలమ్మను అభ్యర్థిగా నిలబెట్టగా, ఆమెపై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీతాకుమారి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో మొత్తం 40 వార్డులకు గాను టీడీపీ 34 వార్డులను గెలుచుకోగా, వైసీపీకి మూడు వార్డులు మాత్రమే దక్కాయి. అనంతరం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ టీడీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. తాజా పంచాయతీ ఎన్నికల్లోనూ అధిక స్థానాలను సొంతం చేసుకుంది.

ఇది కూడా చదవండి:  పులివెందులలోనూ వైసీపీ కుదేలు: రాజకీయం పతనానికి సంకేతమేనా?​

స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుసగా వస్తున్న ఫలితాలు ఉమ్మడి కడప జిల్లాలోని రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపుతున్నాయి. దీర్ఘకాలంగా వైసీపీకి పట్టున్న చోట్లలో  తెలుగుదేశం పాగా వేయడం పలుచన అవుతున్న జగన్ ప్రతిష్ఠ, పలుకుబడికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు, ఫలితాలపై ఆయా పార్టీల శ్రేణులు, ప్రజల్లో భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. గ్రామీణ స్థాయిలో రాజకీయ బలాబలాలను ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.రాబోయే విడతల పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే జోరు కొనసాగుతుందా లేదా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.  స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తిస్థాయిలో ముగిసే వరకు గ్రామీణ రాజకీయాలపై ఆసక్తి కొనసాగుతోంది. తదుపరి ఫలితాలు, రాజకీయ పరిణామాల కోసం ప్రజలు, పరిశీలకులు ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చవచ్చు:  పులివెందులలో జగన్ కు మరో షాక్: జడ్పీటీసీ తెలుగుదేశం కైవసం.!

పులివెందుల ఎంపీపీ ఎన్నికకు కొత్త చిక్కు.!

[TDP win  Balapanuru panchayat, Jagan OwnVillage, Unanimous,  TeluguOne]