జగనీస్ వర్మ.. పిచ్చిరాతలతో రోత.. తారక్ మౌనమేల..

RGV.. ఇండియాలో మోస్ట్ కాంట్ర‌వ‌ర్సీ ఫెలో. సినిమాల‌కంటే సొల్లే ఎక్కువ‌. ఎవ‌రిని కెలికితే, ఎక్కువ వివాదం అవుతుందో వారి వెంట గ‌జ్జిలా ప‌డుతుంటాడు. అయిన దానికీ, కాని దానికీ.. కాక‌మ్మ క‌బుర్లు చెబుతూ సోది మాట్లాడుతాడు. అత‌ని మాట‌లు మంట పుట్టిస్తే.. ట్వీట్లు రోత క‌లిగిస్తాయి. అలాంటి రామ్‌గోపాల్‌వ‌ర్మ కొంత‌కాలంగా చంద్ర‌బాబును త‌గులుకున్నాడు. చెత్తా, చెదారం అంతా పోగేసి ట్విట్ట‌ర్‌లో సీబీఎన్ మీద సొల్లు వాగుతుంటాడు. ప‌నిలో ప‌నిగా లోకేశ్‌నూ, టీడీపీని కాకిలా కుళ్ల‌బొడుస్తుంటాడు. 

తాజాగా, చంద్ర‌బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా వ‌ర్మ చేసిన ట్వీట్‌ వివాదాస్ప‌ద‌మైంది. తెలుగుదేశం పార్టీకి సీబీఎన్, నారా లోకేశ్ వైర‌స్ సోకిందంటూ సెటైర్లు వేశాడు. ఆ వైర‌స్‌కు తార‌క్ వ్యాక్సిన్ ఒక్క‌టే విరుగుడంటూ నోటికొచ్చిన‌ట్టు కూత‌లు రాశాడు. ఎక్క‌డో ఉండి.. త‌ప్ప తాగి.. త‌ల‌తిక్క ట్వీట్లు పెట్టి.. టీడీపీని, నారా ఫ్యామిలీని కెలుకుతూ.. సుడో శాడిజం ప్ర‌ద‌ర్శిస్తున్నాడంటూ వ‌ర్మ‌పై విరుచుకుప‌డుతున్నారు తెలుగు త‌మ్ముళ్లు.

కొంత‌కాలంగా ఆర్జీవి.. టీడీపీ వెంట‌ప‌డుతున్నాడు. 2019 ఎల‌క్ష‌న్స్‌కి ముందు చంద్ర‌బాబు ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌' అంటూ సినిమా తీశాడు. అది ఎప్పుడు వ‌చ్చిందో, ఎప్పుడు వెళ్లిందో, ఎవ‌రు చూశారో.. ఎవ‌రికీ తెలీదు. ఆ అట్ట‌ర్ ఫ్లాప్ మూవీతో.. మేరు ప‌ర్వ‌తంలాంటి చంద్ర‌బాబు ఖ్యాతిపై మ‌చ్చ వేద్దామ‌ని అనుకున్నాడు. ల‌క్ష్మీ పార్వ‌తీ రోల్‌తో సీబీఎన్ మీద బుర‌ద చ‌ల్లే ప్ర‌య‌త్నం చేశాడు. సినిమా తొలి షో కూడా స‌రిగా ఆడ‌క‌పోవ‌డంతో.. వ‌ర్మ క‌థ అడ్డం తిరిగింది. అయినా, 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌'తో ఆగ‌లేదు ఆర్జీవీ. జ‌గ‌న్ గెలిచాక‌.. చంద్ర‌బాబును మ‌ళ్లీ గెల‌క‌డం స్టార్ట్ చేశాడు. 'క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు' అంటూ అర్థం ప‌ర్థం లేని సినిమా తీశాడు. అదీ.. డిజాస్ట‌రే. 

వ‌ర్మ సినిమాల‌తో కానీ, ఆర్జీవీ ట్వీట్ల‌తో కానీ.. చంద్ర‌బాబుకు, టీడీపీకి జ‌రిగే న‌ష్ట‌మేమీ లేదు. ఆకాశం వైపు చూస్తూ ఉమ్మి వేస్తే.. అది త‌న మీదే ప‌డుతుంద‌న్న‌ట్టు.. వ‌ర్మనే జ‌నాలు అస‌హ్యించుకుంటున్నారు. రామ్‌గోపాల్‌వ‌ర్మ‌.. వైసీపీ మౌత్‌పీస్ అంటున్నారు. జ‌గ‌న్ త‌ర‌ఫున వ‌కాల్తా పుచ్చుకొని.. చంద్ర‌బాబుపై, టీడీపీపై లేనిపోని కామెంట్లు చేస్తూ.. శున‌కానందం పొందుతున్నాడ‌ని చీద‌రించుకుంటున్నారు. లేదంటే, కేవ‌లం మూవీ డైరెక్ట‌ర్ అయిన వ‌ర్మ ఎక్క‌డ‌? 15 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా, 10 ఏళ్లు ప్ర‌తిప‌క్ష నేత‌గా రాణిస్తున్న చంద్ర‌బాబు స్థాయి ఎక్క‌డ‌? న‌వ్విపోదురుగాక.. నాకేంటి సిగ్గు అన్న‌ట్టు ఉంది.. వోడ్కా వ‌ర్మ ఓవ‌రాక్ష‌న్ అంటున్నారు.

టీడీపీకి స‌ర్వ‌స్వం చంద్ర‌బాబే. నారా లోకేశ్ పార్టీకి అద‌న‌పు బ‌లం. చంద్ర‌బాబు 72 ఏళ్ల వ‌య‌సులో న‌వయువ‌కుడిలా ఉత్సాహంగా ప‌ని చేస్తున్నారు. మ‌రో ప‌దేళ్లైనా పార్టీని న‌డిపించ‌గ‌లిగే స‌త్తా ఆయ‌న సొంతం. చంద్ర‌బాబుకు ఏమాత్రం తీసిపోని విధంగా నారా లోకేశ్ డైన‌మిక్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. వారిద్ద‌రి నాయ‌క‌త్వంలో తెలుగుదేశం పార్టీ బ‌లంగా, స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తోంది. ఇప్ప‌టికిప్పుడు టీడీపీకి కొత్త లీడ‌ర్ అవ‌స‌ర‌మే లేదు. జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. గ‌తంలో ఓసారి రెండు ప‌డ‌వ‌ల‌పై కాలు పెట్టి చేసిన ప్ర‌యోగం విఫ‌ల‌మైంది. అప్ప‌ట్లో టీడీపీ త‌ర‌ఫున తార‌క్ ప్ర‌చారం చేసినా.. పార్టీ ఓడిపోయింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ రాజ‌కీయాల వైపు క‌న్నెత్తి చూడ‌లేదు జూనియ‌ర్. అయితే.. తార‌క్ మ‌ళ్లీ టీడీపీలోకి రావాలంటూ ఈ మ‌ధ్య కాలంలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ఓ సినిమా ఫంక్ష‌న్లో.. సీఎం సీఎం అంటూ ఫ్యాన్స్ గోల చేస్తే.. ఆగండి బ్ర‌ద‌ర్స్ అంటూ వారిని గ‌ట్టిగానే వారించారు తార‌క్‌. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ‌.. టీడీపీలో చంద్ర‌బాబు, లోకేశ్ వైర‌స్‌ల‌కు.. తార‌క్ వ్యాక్సినే సొల్యూష‌న్ అంటూ సొల్లు వాగుడు వాగాడు. ఇది సీబీఎన్‌ను, లోకేశ్‌ను, టీడీపీని డిస్ట‌ర్బ్ చేసే ప్ర‌య‌త్న‌మే కానీ మ‌రొక‌టి కాదు. ఆ విష‌యం వ‌ర్మ‌కూ తెలుసు. ఏ తాగిన‌ప్పుడో ఆ ట్వీట్ చేసి.. త‌మాషా చూద్దామ‌నుకుంటాడు. అందుకే ఆర్జీవీ వాగుడును తెలుగు త‌మ్ముళ్లు పెద్ద‌గా ప‌ట్టించుకోరు. అదే అత‌నికి అలుసుగా మారింది. 

తార‌క్ సైతం ఇలాంటి విష‌యంపై క్లారిటీ ఇస్తే బాగుంటుంది. తన‌కు రాజ‌కీయాల‌పై ఆస‌క్తి ఉందో లేదో.. తాను ఇప్ప‌ట్లో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తానో లేదో చెబితే.. వ‌ర్మ లాంటి వాళ్ల వాగుడుకి చెక్ ప‌డుతుంది. అత‌ని మౌనం.. ఇలాంటి వారికి అందివ‌చ్చే వ‌రం. లేదంటే వర్మ లాంటి వాళ్లు చేసే ట్వీట్లకు తారక్ కు సంబంధం ఉందనే అనుమానాలు రావచ్చు. ఇప్పటికే కొడాలి నాని లాంటి నేతలు చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా ఎన్టీఆర్ ఏనాడు స్పందించలేదు. కొడాలి ముందు నుంచి తారక్ వెంటే ఉన్నారు, ఇప్పటికి వాళ్లిద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయి. దీంతో కొడాలి విషయంలో తారక్ మౌనం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉంది.  

ఒక‌వేళ తార‌క్‌ రాజ‌కీయాల్లోకి రావాల‌నే అనుకున్నా.. ఏపీ టీడీపీలో ప్ర‌స్తుతానికి అత‌నికంత‌ స్పేస్ లేదు. తెలంగాణ‌లో పార్టీ బాధ్య‌త‌లు తీసుకొని.. త‌న‌ను తాను నిరూపించుకుంటే బెట‌ర్‌. లేదంటే, త‌న‌కు రాజ‌కీయాల‌పై ఆస‌క్తి లేద‌నో.. ఉంద‌నో.. ఏదో ఒక‌టి తేల్చి చెబితే  ఇక ప‌దే ప‌దే ఇలాంటి డిమాండ్లు వినిపించ‌వు. అప్పుడే ఆర్జీవీ లాంటి మొరిగే మ‌నిషి నోటికి తాళం ప‌డుతుంది. ఆర్జీవీకి రాజ‌కీయాల్లో ఓన‌మాలు కూడా తెలీదు. పాలిటిక‌ల్ నాలెడ్జ్ జీరో. అలాంటి ఓ రాజ‌కీయ అనామ‌కుడు.. 40+ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబుపై కామెంట్లు చేయ‌డం అత‌ని పైశాచిక ఆనందానికి నిద‌ర్శ‌నం. బాబు మెత‌క కాబ‌ట్టి.. ఇలాంటి చిల్ల‌ర మ‌నుషుల‌ను, అలాంటి వేస్ట్ కామెంట్ల‌ను ప‌ట్టించుకోరు కాబ‌ట్టి.. వ‌ర్మ మ‌రింత రెచ్చిపోతున్నాడు. రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌ల‌తో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాడని అంటున్నారు.