వైసీపీ ఎమ్మెల్యేలు DNA పరీక్షలు చేయించుకోవాలి...
posted on Nov 20, 2021 1:54PM
వైసీపీ ఎమ్మెల్యేల నీచ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మొత్తం రగిలిపోతోంది. సామాన్య ప్రజానీకం సైతం రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. పిచ్చి వాగుడు వాగిన వారి నాలుకలు కోస్తామంటూ గట్టిగా హెచ్చరిస్తున్నారు. జనానికే ఇంత ఆవేశం, ఆగ్రహం కలిగితే.. ఇక నందమూరి కుటుంబానికి, టీడీపీ శ్రేణులకు ఇంకెంత కోపం రావాలి? అదే జరుగుతోంది. వైసీపీ నేతల తీరును నందమూరి ఫ్యామిలీ ముక్తకంఠంతో ఖండించింది. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అటు, టీడీపీ మహిళా నేతలు సైతం వైసీపీని చెడుగుడు ఆడుకుంటున్నారు.
ఆనాడు సీతను అవమానించిన రావనాసురుడికి ఏ గతి పట్టిందో ఇవాళ భువనేశ్వరిని అవమానించిన వైసీపీకి అదే గతి పడుతుందంటూ మాజీ మంత్రి పీతల సుజాత తీవ్రంగా మండిపడ్డారు. అమ్మ లాంటి నారా భువనేశ్వరి గురించి అలా మాట్లాడితే వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారని పీతల సుజాత నిలదీశారు. పదేళ్లు టీడీపీలో ఉన్న రోజాకు ఎవరు ఎలాంటి వారో తెలియదా? అని ప్రశ్నించారు.
నారా లోకేష్ గురించి మాట్లాడే వైసీపీ ఎమ్మెల్యేలు ముందు డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఇంటికి వెళ్లి వాళ్ల ఆడవారితో డీఎన్ఏ పరీక్షలకు వెళదామని చెప్తే బాగుంటుందంటూ పీతల సుజాత ఫైర్ అయ్యారు.