చర్చలు ఫలించాయి.. సినీ కార్మికుల సమ్మె ముగిసింది
posted on Aug 22, 2025 12:13PM

గత 18 రోజులుగా చేస్తున్న సమ్మెను సినీ కార్మికులు విరమించారు. తెలంగాణ ప్రభుత్వం చొరవతో నిర్మాతలు, కార్మికులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కుదరడంతో నిర్మాతలు , ఫెడరేషన్ నాయకుల తో కార్మికశాఖ అదనపు కమిషనర్ జరిపిన చర్చలు చర్చలు ఫలించాయి. దీంతో ఇంత కాలంగా నిలిచిపోయిన షూటింగ్ ను శుక్రవారం (ఆగస్టు 22) నుంచి ప్రారంభమయ్యాయి.
సమ్మె ముగిసి షూటింగ్ లు ఆరంభం కావడంతో కృష్ణానగర్ లో సందడి కనిపించింది. జూనియర్ అరిటిస్టులు ఇతర విభాగాలకు చెందిన టెక్నీషియన్స్ చేతినిండా పని దొరకుతుందన్న సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 18రోజులుగా షూటింగ్ లు నిలిచిపోవడంతో.. ఇక ఎక్కడా బ్రేక్ లేకుండా షూటింగ్ ను సాగించేలా నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.