స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

 

ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతిలో పర్యటించారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా.. రేణిగుంట మండలం తూకివాకం వద్ద ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ట్రీట్ చేసిన నీటిని ఎలా సద్వినియోగం చేస్తున్నారని అధికారులను అడిగారు. రీసైకిలింగ్  కోసం వచ్చిన ఘన వ్యర్థాలను వినియోగించుకున్న తర్వాత వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు తరలించాలని సూచించారు. తిరుపతి సహా 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో సేకరించిన వ్యర్థాలను వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు సద్వినియోగం చేసుకునేలా చూడాలని స్పష్టం చేశారు. విశాఖ సహా పరిసర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో వ్యర్థాలను సద్వినియోగం చేసేలా చూడాలని పేర్కొన్నారు. 

వ్యర్థాల నిర్వహణలో దేశానికి రోల్ మోడల్‌గా ఏపీ నిలిచేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ క్రమంలో స్థానిక ప్రజలకు, తిరుమలకు వచ్చే భక్తులకు సీఎం కీలక సూచనలు చేశారు. వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చుడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు విశాఖ సహా పరిసర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో వ్యర్ధాలను సద్వినియోగం చేసేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు . ఇళ్ల నుంచి, మార్కెట్ నుంచి సేకరించిన కూరగాయల వ్యర్ధాలను ఎంత మేర ఎరువులగా తయారు చేస్తున్నారని వివరాలు ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. వ్యర్ధాల నిర్వహణలో దేశానికి రోల్ మోడల్ గా ఏపీ నిలిచేలా చూడాలని స్పష్టం చేసిన సీఎం