ఇండియా, అమెరికా దౌత్య వారథి: స్ట్రోబ్ టాల్బాట్ కన్నుమూత.!
Published on: Fri Nov 27, 2026 9:37AM

అమెరికా, ఇండియా దౌత్య సంబంధాలలో కొత్త మలుపునకు కారణమైన దౌత్య వారథి స్ట్రోబ్ టాల్బాట్ కన్నుమూశారు. 80 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
పోఖ్రాన్ అణు పరీక్షల కాలంలో అమెరికా విదేశాంగ డెప్యూటీ మంత్రిగా పని చేసిన ఆయన ఆ సమయంలో భారత్, అమెరికాల మధ్య నెలకొన్న తీవ్ర దౌత్య ఉద్రిక్తతలు సడలిపోయేలా చేయడంలో కీలకంగా వ్యవహరించారు. 1998లో భారత్ నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్షల తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతల వేళ స్ట్రోబ్ టాల్బాట్ అప్పటి భారత విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్‌తో కలిసి సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆ చర్చల ప్రక్రియే ఇరు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త మలుపునకు దారితీసింది.

అమెరికా విదేశాంగ శాఖలో 1994 నుంచి 2001 వరకు విదేశాంగ డిప్యూటీ మంత్రిగా పనిచేసిన టాల్బాట్, అంతర్జాతీయ వ్యవహారాల్లో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా అణ్వాయుధ నియంత్రణ, రష్యా వ్యవహారాలు, దక్షిణాసియా దౌత్య సంబంధాలకు సంబంధించిన విషయాలలో ఆయన పాత్ర అత్యంత కీలకం. పోఖ్రాన్ పరీక్షల నేపథ్యంలో అమెరికా ఆంక్షలు, భద్రతా అంశాలపై జరిగిన దౌత్య సంప్రదింపుల్లో ఆయన పాత్ర ప్రత్యేకంగా నిలిచింది.
ఇది కూడా చదవండి: ఇండియా అమెరికా వాణిజ్య ఒప్పందం: దారులు మూసుకుపోయాయా.. విత్త మంత్రి మాటల సారాంశం అదేనా?
ఇండియా, అమెరికా సంబంధాల చరిత్రలో పోఖ్రాన్ అనంతర దౌత్య సంభాషణలకు ప్రత్యేక స్థానం ఉంది. అప్పటి పరిణామాల మధ్య జరిగిన చర్చలు పరస్పర అవగాహన పెంపొందించడానికి, భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సహకారానికి మార్గం సుగమం చేయడానికి దోహదపడ్డాయి. ఈ పరిణామాలను స్ట్రోబ్ టాల్బాట్ తన రచనలు, విశ్లేషణలలో కూడా ప్రస్తావించారు.

ఆయన మృతి పట్ల ప్రపంచ దౌత్య రంగానికి తీరనిలోటుగా దౌత్య రంగం, విదేశాంగ విధాన నిపుణులు, అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు అభివర్ణిస్తూ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మీకు నచ్చవచ్చు: అమెరికా నుంచి భారత్‌కు చేరిన వేల ఏళ్ల నాటి కళాఖండాలు
భారత్ ,అమెరికా ట్రేడ్ డీల్: మన రైతులకు లాభమా? నష్టమా?
[Strobe Talbott, Nomore, India, America, DiplomaticBridge, Pokhran, Negotiations, TeluguOne]


