నోట్ల రద్దుపై ప్రత్యేక కమిటీ...

 

నల్లధనాన్ని నిర్మూలించేందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పటికే ఈ సమస్యలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు దీనిలో భాగంగానే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ముగ్గురు సీనియర్ అధికారులు ఉంటారని.. అంతేకాదు ఈ ప్రత్యేక కమిటీ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇస్తోందని  పేర్కొంది. సరిహద్దు, సమస్యాత్మక, ముఖ్య ప్రాంతాల నుంచి సమాచారం సేకరిస్తోందని తెలిపింది.