ప్రధాని పదవి తిరస్కరణ: సోనియాది త్యాగమా? అనివార్యతా? స్వామి వాదనలో నిజమెంత.?
Published on: Thu Nov 12, 2026 3:27PM

రాజకీయ చరిత్రలో కొన్ని అంశాలు ఎప్పటికీ వివాదాస్పదమైనవిగా, ఎడతెగని చర్చకు ప్రతీకలుగా నిలిచి ఉంటాయి. అలాంటి అంశాలలో ఒకటి 2004లో సోనియా గాంధీ ప్రధాని పదవీ త్యాగం ఒకటి. సోనియా గాంధీ ప్రధాని పదవిని పూచికపుల్లగా భావించి త్యజించారంటూ దాదాపు రెండు దశాబ్దాలుగా పబ్లిక్, టీవీడిబేట్లలో, పుస్తకాలలో, ఎన్నికల ప్రసంగాల్లోఎడతెగకుండా చర్చ జరుగుతూనే ఉంది. ఆమె ప్రధాని పదవిని త్యాగం చేయలేదు అని అనడం రాజకీయ అపచారంగా ఓ వర్గం అంటుంటే.. అలా అలడం మహాపచారం అంటూ మరో వర్గం గొంతు చించుకుంటోంది. ఈ మొత్తం వ్యవహారంలో సుబ్రహ్మణ్య స్వామి మాత్రం సోనియాది త్యాగం కాదు, అది అనివార్యత అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అందుకు తానే ప్రత్యక్ష సాక్షినంటున్నారు. ఈ విషయంపై తాను కాంగ్రెస్ నాయకులే కాదు, ఎవరితోనైనా చర్చకు సిద్ధమంటూ సవాల్ చేస్తున్నారు.
రాజీవ్ గాంధీ హత్య తర్వాత ప్రధాని ఎంపిక విషయంలో జరిగిన తంతుకు తాను ప్రత్యక్ష సాక్షినని చెప్పుకుంటున్న సుబ్రహ్మణ్యస్వామి.. ఈ మొత్తం వ్యవహారంలో పీవీపై కుట్ర ఉందంటారు. నాడు రాష్ట్రపతి భవన్ లో సోనియా ప్రధాని పదవికి అర్హురాలా అన్నవిషయంపై జరిగిన తర్జన భర్జనలకూ తానే ప్రత్యక్ష సాక్షినని సుబ్రహ్మణ్య స్వామి చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు విషయం ప్రస్తుతం పెద్దగా చర్చలో లేని అంశాన్ని తెరపైకి తెచ్చి వివాదం చేయడం కాదు..
సుబ్రహ్మణ్య స్వామి, స్వామి వెల్లడించిన విషయాలను ఆయన మాటల్లోనే, ఎటువంటి వక్రీకరణ, సవరణలు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పి ఈ విషయంలో వాస్తవాలు, వక్రీకరణలు ఏమిటన్నవి పాఠకుడి విచక్షణకు వదిలేయడం కోసమే ఈ ప్రస్తావన. ఇక్కడ ప్రశ్న పాఠకుడిది, ఆరోపణ సుబ్రహ్మణ్య స్వామిది. సోనియా తాజాగా తన ఆత్మకథను ప్రచురించిన నేపథ్యంలో, ఆ ఆత్మకథలో తాను ప్రధాని పదవిని ఎందుకు వద్దనుకున్నాను అన్న సంగతిని వివరించిన నేపథ్యంలో ఆమె త్యాగం చేశారా? అర్హురాలిని కాదని నిర్ధారించుకుని పక్కకు తప్పుకున్నారా అన్నది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది.

అందుకే సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారనన్నది శుద్ధ అబద్ధం, అమె ఆ పదవి చేపట్టకపోవడానికి ఆమె నిస్సహాయత, అనర్హతే కారణమని చెప్పిన సుబ్రహ్మణ్యస్వామి మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పైగా ఈ విషయాలపై తాను ససాక్ష్యంగా, పత్రాలతో సహా ఉన్నాననీ, ఎవరితోనైనా సరే చర్చకు సిద్ధమనీ సవాల్ చేస్తున్నారు. ఆయన మాటల్లోనే.. 1984 అక్టోబర్ 31న ఇందిరా గాంధీ హత్య జరిగింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. వి.పి. సింగ్ ప్రభుత్వం వచ్చింది, అదీ పూర్తికాలం అధికారంలో కొనసాగలేకపోయి, పతనమైంది. ఆ తరువాత చంద్రశేఖర్ సర్కార్ అధికారపగ్గాలు చేపట్టినా, మధ్యలోనే పతనమైంది. దీంతో దేశంలో మధ్యంతర ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆ ఎన్నికల ప్రచారంలోనే రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఒక కుటుంబంలో ఒకరి తరువాత ఒకరుగా ఇద్దరు హత్యకు గురవ్వడంతో దేశ వ్యాప్తంగా నెహ్రూగాంధీ కుటంబంపై సానుభూతి పవనాలు ఉధృతంగా వీచాయి. సరే ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. అప్పుడు తలెత్తిన ప్రశ్న ఒక్కటే.. ప్రధాని ఎవరు? అక్కడే సోనియా గాంధీ పేరు ముందుకు వచ్చింది. స్వామి ఏమంటారంటే.. ఆమె తల్లి, సోదరి ఈ కుటుంబ వర్గమే ముందుకు వచ్చి నీ అనుభవం చాలా తక్కువ ఇప్పుడు ఏదో ఒక చంచాను కూర్చోబెట్టి, రెండేళ్లు నేర్చుకున్నాక ప్రధాని పదవి చేపట్టవచ్చు అని చెప్పారు. అంటే ప్రధాని పదవి కావాలన్న సోనియా గాంధీ ఆలోచనను ఆమె కుటుంబమే తొలుత అడ్డుకుంది. ఇప్పుడు కాదు రెండేళ్ల తరువాత అంటూ వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: ఒత్తిడితో ఓకే చెప్పా: ఆ తరువాత నో అన్నా.. ప్రధాని పదవిపై సోనియాగాంధీ.!
అప్పుడు దాదాపుగా రాజకీయ సన్యాసం చేసి, హైదరాబాద్‌లో పి.వి. నరసింహారావును ప్రధానిగా చేయాలన్న నిర్ణయానికి నెహ్రూ కుటుంబం ఏకగ్రీవంగా వచ్చింది.అంతే హుటాహుటిన ఆయనను ఢిల్లీకి పిలిపించారు. ప్రధానిని చేశారు. దీనిపై సుబ్రహ్మణ్య స్వామి దేవుడి దయవల్ల ప్రధాని అయిన తరువాత పీవీ ఆయన ఆరోగ్యం కుదుట పడింది. ఇందుకు సంబంధించి రుజువులుగా అప్పటి పీవీ ఫొటోలు తనవద్ద ఉన్నాయని పేర్కొన్నారు సుబ్రహ్మణ్య స్వామి. అది పక్కన పెడితే..పీవీ ప్రధానిగా ఉన్న ఆ ఐదేళ్లలో ఆయనపై అనేక ఆరోపణలు, కేసులు కుప్పతెప్పులుగా వచ్చాయి. దీనిపై సుబ్రహ్మణ్యస్వామి వాదన ఏమిటంటే.. నరసింహారావును కూలదోయాలన్న కుట్ర సోనియాగింధీదే. అది విఫలమైంది. ఎందుకు విఫలమైందంటే.. తాను ఇరవై మంది ఎంపీలను పీవీకి మద్దతు ఇచ్చేలా చేశానంటారు సుబ్రహ్మణ్య స్వామి. ఆ తర్వాత 1996, 1998, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం నుంచి దూరమైంది. సోనియా గాంధీ పార్టీ నాయకత్వాన్ని చేపట్టారు. 2004 మే 13న ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి ఆధిక్యం లభించింది. దీంతో సోనియా గాంధీ ప్రధాని అవుతారని అంతా భావించారు. అయితే ఆమె ప్రధాని పదవి చేపట్టలేదు. ఇక్కడే రెండు భిన్న వాదనలు చర్చలోకి వచ్చాయి. వాటిలో ఒకటి పుస్తకాల్లో, పత్రికల్లో విస్తృతంగా ప్రచురితమైన త్యాగం వెర్షన్ అయితే.. మరొకటి పీవీ సర్కార్ ను కూలదోయాలన్నది సోనియా కుట్ర సోనియా గాంధీ కుట్ర అన్న సుబ్రహ్మణ్యమస్వామి వెర్షన్. అదలా ఉంటే.. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అత్యధిక స్థానాలలో విజయం సాధించింది. ఈ ఫలితాలు 2004 మే 13న వెలువడితే.. అదే నెల 15, 18 మధ్య సోనియా ప్రధాని అంటూ ఎంపీల సంతకాలు సేకరణ జరిగిందనీ, మే 18 సాయంత్రం అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి ఆహ్వానం అందిందనీ స్వామి చెబుతారు. ఆ రాత్రి సోనియా కన్నీటిపర్యంతమయ్యారనీ, మరుసటి రోజు అంటే మే 19న ప్రధాని పదవిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారనీ స్వామి వాదన. ఈ రాజకీయ పరిణామాల వెనుక చట్టపరమైన అంశాలు కూడా ఉన్నాయంటారాయన. భారత పౌరసత్వ చట్టంలో పరస్పరత సూత్రం ఉందని, అంటే మన దేశంలో పౌరసత్వం పొందిన విదేశీయుడికి ఏ పరిమితులు వర్తిస్తాయో, అదే పరిమితులు ఆయా దేశాల్లో మన పౌరులకూ వర్తిస్తాయి. ఇటలీలో ఒక భారతీయుడు పౌరసత్వం పొందినా ప్రధాని కాలేడు. అదే విధంగా సోనియా గాంధీ భారత పౌరసత్వం ఉన్నప్పటికీ ప్రధాని పదవి చేపట్టలేని పరిస్థితి ఆమెకు స్వయంచాలకంగా వర్తిస్తుందన్నది సుబ్రహ్మణ్యస్వామి వాదన. ఈ విషయాన్నిఅప్పటి అటార్నీ జనరల్ కూడా ధృవీకరించారని చెబుతారు. ఈ వాదన రాజకీయంగా 2004కు ముందే మొదలై, బీజేపీకి ప్రధాన ఆయుధంగా మారింది.
.webp)
సోనియా గాంధీ రాజకీయ ప్రవేశం దుఃఖం నుంచి మొదలైంది. భర్తను పోగొట్టుకున్న మహిళ, ఇద్దరు పిల్లలను పెంచుకుంటూ, పార్టీని మోస్తున్న మహిళ అన్న చిత్రం ప్రజల సెంటిమెంట్ ను తాకింది. ఆ నేపథ్యంలోనే ప్రధాని పదవిని తృణప్రాయంగా త్యాగం చేశారన్న కీర్తిని సోనియాకు దక్కిందన్నది స్వామి చెప్పే మాటల సారాంశం. ఇప్పుడు ఇరవై ఏళ్ల తర్వాత, సోషల్ మీడియా యుగంలో పాత క్లిప్పింగ్లు వైరల్ అవుతుండటంతో స్వామి అప్పట్లో చెప్పిన విషయాలు, ఆయన వెర్షన్, సోనియా గాంధీ చేసిన త్యాగమా; అనివార్యంగా ఎదురైన అడ్డంకా అన్న చర్చ మళ్లీ తెరమీదకు వచ్చింది. ప్రధాని మన్మోహన్ సింగ్ అయినప్పటికీ, నిర్ణయాలు పార్టీ అధ్యక్షురాలి ఆమోదంతోనే సాగుతున్నాయన్న చర్చ పదేళ్లు కొనసాగింది. ఆ పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ వంటి పథకాలతో ప్రజలకు దగ్గరైనా, కుటుంబం మీద విమర్శలు వచ్చినప్పుడల్లా త్యాగం ఆ కుటుంబానికి రక్షణ కవచంగా మారింది. అంటారు స్వామి. అయితే స్వామి ఆరోపణలను పూర్తిగా నమ్మడానికీ, అలాగని పూర్తిగా తిరస్కరించడానికి అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థిగా స్వామి వాదనను స్వతంత్రంగా ధృవీకరించబడాల్సి ఉంటుంది. సోనియా గాంధీ నిజంగానే త్యాగం చేశారా? లేక పరిస్థితుల ప్రభావంతో అనివార్యంగా ఆమె ప్రధాని పదవిని చేపట్టలేకపోయారా? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. అధికారిక పత్రాలు, ఆర్కైవ్స్ బయటికి వస్తేనే అసలు నిజాలు వెలుగుచూస్తాయి.
మీకు నచ్చవచ్చు: నా తొలి బిడ్డ రాహుల్ గాంధీ కాదు: ఆ బిడ్డకేమయ్యిందో తెలుసా? ఆత్మకథలో వెల్లడించిన సోనియా.!
రాజీవ్‌కు రాజకీయాలు వద్దన్న సోనియా.. రాహుల్ విషయంలో ఎందుకు మౌనం.?
-కంఠంనేని సీతారాం
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
[SoniaGandhisacrifice, PrimeMinisterost, Subrahmanyaswamy, Version, PVnarasimharao, TeluguOne]


