TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నా తొలి బిడ్డ రాహుల్ గాంధీ కాదు: ఆ బిడ్డకేమయ్యిందో తెలుసా? ఆత్మకథలో వెల్లడించిన సోనియా.!

Published on: Wed Nov 11, 2026 9:56AM

కాంగ్రెస్  మాజీ అధ్యక్షురాలు, ఆ పార్టీ   అగ్రనేత సోనియా గాంధీ తన ఆత్మకథ  బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌లొ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర, ఉద్వేగ భరిత ఉదంతాలను వెల్లడించారు.    తన భావోద్వేగాలను, ఎవరికీ తెలియని రహస్యాలను కూడా సోనియాగాంధీ తన ఆత్మకథలో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ జననానికి ముందే తను ఎదుర్కొన్న ఒక పెను విషాదాన్ని ఆమె తన ఆత్మకథ  పుస్తకంలో పంచుకున్నారు.

  1969 జనవరి 18వ తేదీన ప్రసవ తేదీ కన్నా రెండు నెలల ముందే సోనియా గాంధీ సాధారణ ప్రసవం ద్వారా ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. నల్లని జుట్టు, సన్నని పొడవాటి వేళ్లతో ఎంతో అందంగా ఉన్న ఆ పసికందును చూసి రాజీవ్, సోనియా దంపతులు ఎంతగానో ఆనందించారు. అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. నెలలు నిండకుండా పుట్టడంతో ఆ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉందని వైద్యులు తెలిపారు.

మరుసటి రోజు ఉదయమే రాజీవ్ గాంధీ వచ్చి బిడ్డను కాపాడుకోలేకపోయినట్లు చెప్పడంతో  గుండె పగిలేలా రోదించానని సోనియా ఆత్మకథలో పేర్కొన్నారు. ఆ సమయంలో ఆసుపత్రికి చేరుకున్న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దుఖంతో బరువెక్కిన హృదయంతో, కన్నీటి ధారలతో ఎర్రబారిన  కళ్లతో వారిని ఓదార్చారు. పర్యటన మధ్యలోనే  వచ్చి కొద్దిసేపు వారితో గడిపిన ఇందిర, భారమైన హృదయంతో తిరిగి వెళ్లారు.

అయితే ఆ పసికందు అంత్యక్రియల విషయంలో కుటుంబానికి పెద్ద సవాలు ఎదురైంది. హిందూ సంప్రదాయాల ప్రకారం చిన్నపిల్లల మృతదేహాలను దహనం చేయరని, నదిలో వదిలేయాలని కొందరు చెప్పారనీ,  తన బిడ్డను నదిలో పడేసేందుకు తాను  ససేమిరా అంగీకరించలేదనీ సోనియా ఆ పుస్తకంలో వివరించారు. చివరికి ఆ పసికందు మృతదేహాన్ని మెహ్రౌలీలోని ఫిరోజ్ గాంధీ వ్యవసాయ క్షేత్రంలో రాజీవ్, సంజయ్ గాంధీలు   ఖననం చేశారు.

ఇది కూడా చదవండి: రాజీవ్‌కు రాజకీయాలు వద్దన్న సోనియా.. రాహుల్ విషయంలో ఎందుకు మౌనం.?

ఆ తీవ్ర విషాదం నుంచి కోలుకుంటున్న సమయంలో, ఓ పత్రికలో ఈ సంఘటనపై వచ్చిన విషపూరితమైన రాతలు తన మనసును  గాయపరిచాయని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. మనుషులు ఇంత క్రూరంగా ఎలా ఉండగలరని ఆమె తన ఆత్మకథలో ఆవేదనతో రాసుకొచ్చారు. 

కాలక్రమేణా ఆ శోకం నుంచి బయటపడిన దంపతులు, అదే ఏడాది అక్టోబర్‌లో మళ్లీ తల్లికాబోతున్న శుభవార్తను తెలుసుకున్నారు. అలా సర్వాత్రా ఆందోళనల నడుమ 1970 జూన్ 19న రాహుల్ గాంధీ జన్మించారని సోనియా గాంధీ తన పుస్తకంలో గుర్తుచేసుకున్నారు.

మీకు నచ్చవచ్చు: సోనియా ఆత్మకథలో అసలు నిజాలెన్ని.. వైట్‌వాషింగ్ అంటూ బీజేపీ విమర్శలు.!

ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కావాలనుకున్నారు..సోనియా ఆత్మకథలో సంచలన విషయాలు. !

[Sonia Gandhi 1st child, Sonia Autobiography, Belonging A Journey of Love, First Child Death, Telugu One]