TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సోనియా ఆటోబయోగ్రఫీ: కొత్త రికార్డు సృష్టిస్తున్న విక్రయాలు.!

Published on: Wed Nov 18, 2026 8:59AM

ఇండియన్ పాలిటిక్స్ లో దశాబ్దాలుగా కీలకంగా ఉన్న  కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా ఆత్మకథ  దేశ పుస్తక ప్రచురణ రంగంలోనే ఓ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ప్రచురణ అయిన రెండు రోజులలోనే ఆమె ఆటో బయోగ్రఫీ బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్  ప్రచురణ రంగంలో అపూర్వ చరిత్ర సృష్టిస్తోంది.    సోనియా జ్ఞాపకాల దొంతరకం పుస్తకం మార్కెట్‌లోకి విడుదలైన రెండు రోజుల్లోనే ఈ పుస్తకం విక్రయాలు కొత్త రికార్డులను నమోదు చేశాయి.  

ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్‌కొలిన్స్ ఇండియా ఈ పుస్తకాన్ని  మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. సాధారణంగా రాజకీయ నాయకుల ఆత్మకథలకు ఉండే ఆదరణ కంటే చాలా చాలా ఎక్కువగా ఈ పుస్తకం ప్రజాదరణ పొందింది.  సోనియా గాంధీ జీవితంలోని వ్యక్తిగత కోణాలు, తెలియని అనేక విషయాలు ఈ పుస్తకంలో ఉండటంతో పాఠకులు దీనిని కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నారు. పుస్తకం విడుదలైన రోజుల వ్యవధిలోనే లక్షల కాపీలు అమ్ముడుపోవడమే ఇందుకు నిదర్శనం.  

గాంధీ కుటుంబానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక  అంశాలు, ఎన్నడూ వెలుగులోకి రాని రహస్యాలు ఈ పుస్తకంలో ఉండటం వల్ల దీనిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమైంది.  సోనియా తన ఆటోబయోగ్రఫీలో  రాజకీయ విషయాలకే పరిమితం కాకుండా, ఒక సాధారణ మహిళగా ఆమె భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఎదుర్కొన్న సవాళ్లు, వ్యక్తిగత జీవితయానం, విషాదాలు, ఆనందాలను సోనియా తన ఆటోబయోగ్రఫీలో హృదయాలను హత్తుకునేలా ప్రజెంట్ చేశారు. అందుకే ఈ పుస్తకానికి విశేష పాఠకాదరణ లభిస్తోంది. 

ఇండియన్ పొలిటికల్ పర్సనాలిటీలకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన ఆటోబయోగ్రఫీలలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల సరసన ఇది నిస్సందేహంగా నిలుస్తుందనీ, వాటిని దాటేయడం ఖాయమనీ పరిశీలకులు ఆ పుస్తకాల విక్రయం అవుతున్న వేగాన్ని బట్టి అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బుక్‌స్టోర్లు,యు ఆన్‌లైన్ వేదికలపై ఈ పుస్తకం కోసం పాఠకులు ఎగబడుతున్నారు. 

ఇది కూడా చదవండి:  రాహుల్‌కు ముందే పుట్టిన మగబిడ్డ.. తొలి కాన్పుపై సోనియా భావోద్వేగ జ్ఞాపకాలు.!

ఈ పుస్తకానికి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఇది భారతీయ ప్రచురణ చరిత్రలో సరికొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించే అవకాశం ఉంది.    సోనియా గాంధీ రాసిన ఈ జ్ఞాపకాల దొంతర   పుస్తకం దేశ రాజకీయాలలో అత్యంత చర్చనీయాంశగా మారిన పుస్తకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ విజయం కేవలం పుస్తకాల విక్రయం ద్వారా వచ్చే వాణిజ్య విజయం మాత్రమే కాదనీ, సోనియా జీవనయానం పట్ల ప్రజలలో ఉన్న గౌరవానికి నిలువెత్తునిదర్శనమనీ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. 

రానున్న రోజులలో బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తక విక్రయాలు మరింత జోరందుకుంటాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ సోనియా ఆటోబయోగ్రఫీపై దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలలో చర్చాగోష్ఠులు నిర్వహించేందుకు సమాయత్తమౌతున్నట్లు తెలుస్తోంది.  

మీకు నచ్చవచ్చు:   ఒత్తిడితో ఓకే చెప్పా: ఆ తరువాత నో అన్నా.. ప్రధాని పదవిపై సోనియాగాంధీ.!

రాజీవ్‌ గాంధీకు నో.. రాహుల్‌కు ఓకేనా? సోనియా ఆత్మకథలో ఆసక్తికర విషయాలు.!


[Sonia Gandhiautobiography, Belonging, Sonia Gandhibooksales, Newrecord, TeluguOne]