రాహుల్‌కు ముందే పుట్టిన మగబిడ్డ.. తొలి కాన్పుపై సోనియా భావోద్వేగ జ్ఞాపకాలు.!
Published on: Wed Nov 11, 2026 1:29PM

నా బిడ్డను నదిలో పడేయడమా?: ఆత్మకథలో సోనియా సంచలన విషయాలు.!
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తన జీవితంలోని అత్యంత విషాదకరమైన ఎవరికీ తెలియని రహస్యాలను తన తాజా ఆత్మకథ ద్వారా వెలుగులోకి తెచ్చారు. రాజకీయ రంగానికి దూరంగా ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదురైన కఠిన సత్యాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
తాను రచించిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంలో సోనియా గాంధీ తన ప్రథమ సంతానానికి సంబంధించిన చేదు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తాను తొలిసారి తల్లికాబోతున్నానని తెలిసినప్పుడు గాంధీ కుటుంబంలో నెలకొన్న ఆనందోత్సాహాలను ఆమె గుర్తుచేసుకున్నారు. ఎప్పుడూ అత్యంత గంభీరంగా కనిపించే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సైతం ఆ వార్త విని ఎంతో సంతోషించారని తెలిపారు.
అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణీత గడువు కంటే రెండు నెలల ముందే తనకు సాధారణ ప్రసవం జరిగిందని, ఆ సమయంలో జన్మించిన మగబిడ్డ కేవలం కొన్ని గంటల పాటు మాత్రమే జీవించి లోకాన్ని వీడాడని ఆమె తెలిపారు. ఇంక్యుబేటర్‌లో ఉన్న ఆ పసికందు మొదటి ఏడుపు తాము విన్నామని, ఆనందం ఆవిరైపోవడానికి ఎంతో సమయం పట్టలేదని ఆమె కంటతడి పెట్టారు.
చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో బతుకుతుందనే ఆశలు సన్నగిల్లాయని వైద్యులు చెప్పిన క్షణాలు తమను కుంగదీశాయని సోనియా పేర్కొన్నారు. మరుసటి రోజు ఉదయం రాజీవ్ గాంధీ తన వద్దకు వచ్చి బిడ్డను కాపాడుకోలేకపోయినట్లు చెప్పగానే తాము గుండె పగిలేలా రోదించామని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ తన పర్యటనలను తక్షణమే రద్దు చేసుకుని వచ్చి తమను ఓదార్చారని చెప్పారు.
ఆ పసికందు అంత్యక్రియల విషయంలోనూ కుటుంబం ఎన్నో సంకట పరిస్థితులను ఎదుర్కొవాల్సి వచ్చిందని సోనియా తెలిపారు. హిందూ, క్రిస్టియన్ లేదా పార్సీ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలపై చర్చలు జరిగాయని, ఆ పసికందు మృతదేహాన్ని నదిలో వదిలేయాలనే యోచన కూడా వచ్చిందని పేర్కొన్నారు. అయితే తన బిడ్డను నదిలో పడేసేందుకు తాను ఏమాత్రం అంగీకరించలేదని స్పష్టం చేశారు.
చివరకు ఆ చిన్నారి పార్థివ దేహాన్ని మెహ్రౌలీలోని ఫిరోజ్ గాంధీ వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేశామని సోనియా వెల్లడించారు. ఆ తీవ్ర విషాదం నుంచి కోలుకుంటున్న తరుణంలో ప్రతిపక్ష పత్రికల్లో వచ్చిన కొన్ని విమర్శనాత్మక కథనాలు తన మనసును మరింతగా గాయపరిచాయని ఆమె వాపోయారు. కాలక్రమేణా ఆ బాధను దిగమింగుకుంటూ ముందుకు సాగామని తెలిపారు.
.webp)
ఈ ఒడుదొడుకుల తర్వాత మళ్లీ అదే ఏడాది అక్టోబర్‌లో తాను గర్భం దాల్చినట్లు రాజీవ్‌కు చెప్పానని సోనియా గుర్తుచేసుకున్నారు. భయంతో కూడిన ఆందోళనల నడుమ చివరకు 1970 జూన్ 19న రాహుల్ గాంధీ జన్మించారని ఆమె తెలిపారు. నాటి ఆ సంక్షోభాలు, కుటుంబ మద్దతు రాజకీయ నేపథ్యంలో ఓ చారిత్రక అధ్యాయంగా నిలిచాయని చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి: విజయసాయి కొత్త పార్టీ పీఆర్ పీ: ఏపీ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యమని ప్రకటన.!
[ Sonia Gandhis autobiography, Belonging a Journey of Love, Rajiv Gandhi Sonias first child, Indira Gandhis daughter-in-law, Sonia Gandhis personal life, Telugu One, Telugu News ]


