కరోనాను గుర్తించేందుకు స్మార్ట్ హెల్మెట్లు

కరోనాపై పోరాటంలో చైనా విజయం సాధించింది. ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని చైన్నా అధికారికంగా ప్రకటించింది. దేశంలోని ఏ పౌరుడికీ కరోనా పాజిటివ్ రాలేదని వెల్లడించింది. వూహాన్ లో కొత్త కేసులు లేవని, పాజిటివ్ వచ్చిన వారు కూడా చికిత్స తరువాత ఇళ్లకు వెళుతున్నారని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. కాగా, వూహాన్ లో దాదాపు కోటి మందికి పైగా ప్రజలను, అత్యంత కఠినమైన నిర్ణయాలతో జనవరి 23 నుంచి ఇళ్లకు మాత్రమే పరిమితం చేశారు. హుబేయ్ ప్రావిన్స్ ను మూసివేసి, దాదాపు 4 కోట్ల మందిని లాక్ డౌన్ చేసిన చైనా, వారి అవసరాలు తీరుస్తూ, వైరస్ పూర్తిగా చచ్చిపోయేంత వరకూ ఆంక్షలను కొనసాగించింది. చైనాలో మృతుల సంఖ్య 3,245కు చేరిందని కమిషన్ పేర్కొంది.

 

మొత్తం 81 వేల మందికి పైగా ఇన్ఫెక్షన్ సోకగా, ప్రస్తుతం 7,263 మందికి చికిత్స కొనసాగుతోందని పేర్కొంది. చైనాలో కరోనా చికిత్సలు అందించిన ఆసుపత్రులను సైతం మూసివేశారు. ఈ నెల 10న వూహాన్ లో స్వయంగా పర్యటించిన అధ్యక్షుడు జిన్ పింగ్, వైరస్ ను తాము జయించినట్టేనని ప్రకటించారు.

కరోనా వైరస్ బాధితులను గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంది. చైనాలో పోలీసు అధికారులు కరోనా ప్రిడేటర్లుగా మారిపోయారు. స్మార్ట్ హెల్మట్లను ధరించి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వీధుల్లో వెళ్లే పాదాచారుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయో లేదో ఈ స్మార్ట్ హెల్మట్ల ద్వారా వారి శరీర ఉష్ణోగ్రతను నమోదు చేస్తున్నారు. షెన్ జాన్ ఆధారిత కంపెనీ కుయాంగ్-చి టెక్నాలజీ ద్వారా స్మార్ట్ హెల్మట్లను డెవలప్ చేసింది. జనం ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో ఎవరికైనా అసాధారణ శరీర ఉష్ణోగ్రతలు ఉంటే వెంటనే ఈ స్మార్ట్ హెల్మెట్లు పసిగట్టేస్తాయి. వీటి సిగ్నల్ ద్వారా ఆయా బాధితులను గుర్తించి వారిని ప్రత్యేక కరోనా వార్డులకు తరలిస్తున్నారు.

 

 

స్మార్ట్ హెల్మట్లతో పోలీసు అధికారులు కరోనా వైరస్ బాధితులను గుర్తిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పీపుల్స్ డెయిలీ తమ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. వీడియోలో పోలీసు అధికారులు స్మార్ట్ హెల్మట్లతో పెట్రోలింగ్ నిర్వహించడం కనిపిస్తోంది. ఈ స్మార్ట్ హెల్మట్లలో శరీర ఉష్ణోగ్రతను గుర్తించే డిటెక్టర్లు, కోడ్ రీడ్ కెమెరాలు ఉన్నాయి. జనం మధ్యలో ఎవరికైనా జ్వరం లక్షణాలు ఉంటే వారిని వెంటనే coronavirus epidemicను ఈ స్మార్ట్ హెల్మట్లు గుర్తిస్తాయి.

ఐదు మీటర్ల దూరంలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించిన వెంటనే ఈహెల్మట్ల నుంచి అలారం మోగుతుంది. అంతే.. ఆ వ్యక్తిని తీసుకెళ్లి ప్రత్యేకవార్డుల్లోకి తరలిస్తున్నారు.