ఇన్నాళ్లూ నిద్ర‌పోతున్నారా?.. జ‌వ‌హ‌ర్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచీ రాజ‌ధాని విష‌యం న‌లుగుతూనే ఉంది. కానీ ఇప్పటికీ ఇద‌మిద్ధం తేల‌డం లేదు. దీనికి తోడు తాజాగా అస‌లు రాజ‌ధాని అంశం రాష్ట్ర ప‌రిధిలోనిది కాద‌ని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి అన‌డం ప‌ట్ల విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. ఇప్పుడు రాజ ధాని ఏర్పాటు విష‌యంలో రాష్ట్రానికి అధికారం లేద‌న్న సంగ‌తిప‌ట్ల వైసీపీ ఎం.సీ విజ‌య‌సాయి రెడ్డి ఇప్పుడు గ్ర‌హించ‌డం ప‌ట్ల సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కే.రామ‌కృష్ణ మండిప‌డ్డారు. ఇన్ని రోజులు ఆయ‌న నిద్ర‌పోతు న్నారా అని విమ‌ర్శించారు. 

అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉంటుంద‌ని గ‌త టీడీపీ ప్ర‌భుత్వం అన్ని ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ అది కార్య రూపం లోకి రాలేదు. రాజ‌ధానిగా అమ‌రావ‌తిని అభివృద్ధికి చేయ‌వ‌ల‌సిన అన్ని ప్ర‌య‌త్నాలు చంద్ర బాబు ప్ర‌భుత్వం చేసింది. రాజ‌ధాని ఎలా ఉండాలి, ఎలా నిర్మించాల‌న్న‌దీ దూర దృష్టితో ఆలోచించి విదేశీ సంస్థ‌ల‌తో దాని రూపురేఖ‌లు త‌యారుచేయించారు. కానీ ఆల‌స్యం అమృతం విషంలా నిర్మాణ కార్యక్ర‌మాలు జ‌ర‌గ‌నే లేదు. ఇంత‌లో ఎన్నిక‌ల్లో ఊహించ‌ని విధంగా వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చింది. ప్ర‌త్యేక హోదాతో పాటు రాజ‌ధాని అం శాన్ని కూడా తేలుస్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు ఎంతో హామీనిచ్చారు. ప్ర‌జ‌లు ఎంత‌గానో ఆశించిన‌ప్ప‌టికీ ఏదీ చేయలేక‌పోగా ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లూ పోగొట్టుకున్నారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందీ క‌ల‌గ‌కుండా అన్నీ స‌వ్యంగా చేస్తామ‌ని అన్న జ‌గ‌న్ స‌ర్కార్ అమ‌రావ‌తితో పాటు మ‌రో రెండు ప‌ట్ట‌ణాల‌ను కూడా రాజ‌ధానులుగా అభివృద్ధి చేయ‌డానికి పూనుకున్నారు. పాల‌నాప‌ర‌మైన వెసులు బాటు కోసం  ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆయ‌న ప్ర‌చారం చేసుకున్నారు.

ఇదిలా ఉండ‌గా, ఇన్నిరోజుల తర్వాత.. ఏపీలో మూడు రాజధానుల విషయంలో రాష్ట్రాలకు పూర్తి అధి కారం ఇవ్వాలని రాజ్యాంగ సవరణ కోరుతూ పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్ దాఖలు చేయట మేమి ట‌ని టీడీపీనేత జ‌వ‌హ‌ర్  ప్రశ్నించారు. అసలు సీఎం జగన్మోహన్ రెడ్డి కి చిత్తశుద్ధి ఉంటే అమరా వతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, పోలవరం, అమరావతి నిర్మాణాలకు కేంద్రం నుండి నిధులు రాబట్టా లని డిమాండ్ చేశారు.