గులాబ్ జామూన్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. ఈ నిజాలు తెలిస్తే దిమ్మ తిరుగుతుంది..!


భారతదేశంలో స్వీట్లకు, ముఖ్యంగా గులాబ్ జామున్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అది పండుగ అయినా, పెళ్లి అయినా, ఆఫీస్ పార్టీ అయినా - గులాబ్ జామున్ కనిపించకుండా ఉండదు. పైగా గులాబ్  జామూన్ వండటం కూడా చాలా తేలిక.  దీని కారణంగా చాలామంది గులాబ్ జామూన్ ను చేయడానికి ఇష్టపడతారు.  ఇక దీని రుచి కారణంగా దీనికి విపరీతమైన అబిమానులు ఉన్నారు.  విదేశీయులు సైతం గులాబ్ జామూన్ అంటే పడి చస్తారు. కానీ గులాబ్ జామూన్ గురించి కొన్ని నిజాలు తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది.  అవేంటో తెలుసుకుంటే..

గులాబ్ జామూన్ రుచిగా ఉన్నప్పటికీ ఈ గులాబ్  జామున్‌లో దాగి ఉన్న చక్కెర,  సంతృప్త కొవ్వు స్థాయి నేరుగా  శరీరానికి ఎన్ కౌంటర్ లాంటి చేటు చేస్తుందట.  ఇది ఊబకాయాన్ని పెంచడమే కాకుండా, గుండె జబ్బులు, మధుమేహం,  కాలేయ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. స్వీట్లు అంటే ఇష్టమే అయినా ఇలా చక్కెర, నూనె ఎక్కువగా వినియోగించి చేసే పదార్థాల విషయంలో చాలా జాగ్రత్త అవసరమని అంటున్నారు ఆహార నిపుణులు, ఆరోగ్య వైద్యులు.

తియ్యని రుచి కాదు.. కేలరీల  కొండ..

ఒక చిన్న గులాబ్ జామున్ సగటున 125 నుండి 150 కేలరీలు ఇస్తుందని తెలుసా? చాలా షాకింగ్ గా అనిపిస్తుంది కానీ ఇదే నిజం. ఇందులో దాదాపు 20 గ్రాముల చక్కెర,  5 గ్రాముల కంటే ఎక్కువ సంతృప్త కొవ్వు ఉంటుంది. కేవలం ఒక్క చిన్న గులాబ్ జామూన్ లోనే ఇంత ఉంటే.. ఇక రుచి బాగుందని ఆబగా తినే వారి సంగతి తలచుకుంటే చక్కెర కొండ మింగుతున్నారా అని అనిపిస్తుంది.

 రుచి మోజులో శరీరానికి ఎంతో చేటు చేసే పదార్థాలను అవగాహన లేకుండానే అలా పొట్టలోకి పంపేస్తున్నామని చాలామందికి అస్సలు తెలియదు. ఇటువంటి స్వీట్లను నిరంతరం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది, జీవక్రియ నెమ్మదిస్తుంది,  వేగంగా బరువు పెరుగుతుంది.  బరువును నియంత్రించుకోవాలనే ఆలోచనలో ఉన్నవారు ఇలా చక్కెర శాతం ఎక్కువగా ఉండే గులాబ్ జామూన్ లాంటి స్వీట్లను అస్సలు తీసుకోకూడదని అంటున్నారు ఆహార నిపుణులు.

స్వీట్లు ఈ జనరేషన్ లోనే ఎందుకు చేటు చేస్తున్నాయ్..

కాస్త వివరంగా ఆలోచిస్తే.. గతంలో  అంటే కిందటి తరాల వారికి శారీరక శ్రమ ఎక్కువ ఉండేది. కానీ శారీరక శ్రమ తక్కువగా ఉన్న నేటి జీవనశైలిలో, చక్కెరను అధికంగా తీసుకోవడం శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. స్వీట్లు రక్తంలో చక్కెరను అసమతుల్యత చేయడమే కాకుండా ఫ్యాటీ లివర్,  అధిక ట్రైగ్లిజరైడ్లను కూడా కలిగిస్తాయి . ఈ ప్రభావం పిల్లలు,  వృద్ధులలో మరింత ప్రమాదకరం. కాబట్టి, 'రుచి' పేరుతో   ఆరోగ్యాన్ని లైట్ తీసుకోకూడదు.

పిల్లలకు, వృద్దులకు చేసే చేటు..

స్వీట్లు తినడం మద్య వయసు వారికే ప్రమాదం అనుకుంటే పొరపాటు. పిల్లలకు, వృద్దులకు ఇది చాలా డేంజర్.. పిల్లల్లో స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, దంతక్షయం, హైపర్యాక్టివిటీ వంటి సమస్యలు వస్తాయి. మరోవైపు వృద్ధులలో స్వీట్లు రక్తంలో చక్కెరను పాడు చేస్తాయి.  ఇది మధుమేహం, గుండె జబ్బులు,  మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది. చాలా సార్లు  "కొంచెం తీపి తింటే ఏమి తేడా ఉంటుంది" అని  లైట్ తీసుకునే వారు ఎక్కువ.  కానీ ఈ చిన్న మొత్తాలు కలిసి శరీరంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. భవిష్యత్తులో  ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా చిన్నతనం నుండే పిల్లల అలవాట్లకు సరైన దిశానిర్దేశం చేయడం చాలా ముఖ్యం.

                               *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..

 

Related Segment News