సీఎం అభ్యర్ధిత్వానికి షీలా నో.. కారణం అదేనా..?


యూపీ సీఎం అభ్యర్ధి ఎవరన్న దానిపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ యూపీ సీఎంగా షీలా దీక్షిత్ పేరును తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనికి షీలా దీక్షిత్ నిరాకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం అభ్యర్ధిత్వంపై సోనియాగాంధీ షీలా దీక్షిత్ తో చర్చించగా దానికి ఆమె నిరాకరించినట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే దీనికి కారణం  షీలా దీక్షిత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన నీళ్ల టాంకర్ల కుంభకోణంపై ఆరోపణలు రావడమే అంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. నీళ్ల టాంకర్లపై కుంభకోణ జరిగిందంటూ షీలా దీక్షిత్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆమె విచారణలో పాల్గొననున్నారు.

 

కాగా ముందుగా యూపీ సీఎం అభ్యర్దిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని బరిలో దించుదామని అనుకున్నారు. కానీ రాహుల్ గాంధీ అయితే గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయని.. రాహుల్ ను కాకుండా.. ప్రియాంక గాంధీని బరిలో దించాలని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారు. ప్రియాంక గాంధీనే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారు అనుకున్నారు. కానీ సోనియా గాంధీ మాత్రం షీలా దీక్షిత్ ను ఎన్నికల్లో దించాలని చూశారు. ఈ నేపథ్యంలో ఆమెతో భేటీ కూడా అయ్యారు. కానీ ఆఖరికి ఆమె నిరాకరించింది. మరి ఇప్పుడు ఎవరు ఎన్నికల బరిలో దిగుతారో చూడాలి. రాహుల్ కు అవకాశం ఇస్తారా.. ? లేక ప్రియాంకాకు అవకాశం ఇస్తారా..? లేక వారిద్దరికి కాకుండా.. మరెవరికైనా అవకాశం ఇస్తారా చూడాలి. సోనియా ఏ నిర్ణయం తీసుకుంటారో..