స‌మైఖ్యవాదుల లేఖాస్త్రం

 

శుక్రవారం డిల్లీలో రాజ‌కీయ ప‌రిణామ‌లు గంట‌కో మ‌లుపు తిరిగాయి.. ఉద‌యాన్నే జ‌ర‌గాల్సిన కోర్‌క‌మిటీ భేటి వాయిదా ప‌డ‌టంతో తెలంగాణ విష‌యంలో మ‌రోసారి కాంగ్రెస్ వెనుక‌డుగు వేసింది అనుకున్నారంతా.. ఈలోపు స‌మైఖ్యాంద్ర వాదులు త‌మ వాద‌న‌ను గ‌ట్టిగా వినిపిచ‌టంతొ అంతా డైలామాలో ప‌డ్డారు.. అయితే మ‌రోసారి డిగ్గీ త‌న మార్క్ రాజ‌కీయ చ‌తుర‌త చూపించారు.. ,మిని కోర్ క‌మిటీ భేటి నిర్వహించిన దిగ్విజ‌య్ ఇక సంప్రదింపులు ముగిసాయి.. నిర్ణయ‌మే త‌రువాయి అంటూ స‌మైఖ్యవాధుల గుండెల్లో గుబులు పుట్టించారు..
 
ఈ నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి శుక్రవారం సాయంత్రం ఓ లేఖ రాశారు. కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు ఇంట్లో భేటి అయిన‌ సీమాంధ్ర మంత్రులు  ప్రత్యేక దూత తో తమ లేఖను సోనియాకు పంపించారు. ఏకపక్షంగా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే తాము పార్టీకి, పదవులకు రాజీనామాలు చేస్తామని వారు తమ లేఖలో హెచ్చరించారు.

తెలంగాణ‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవ‌టం వ‌ల్ల రాష్ట్రానికి గాని, పార్టీకి గాని ఎలాంటి ఉప‌యోగం లేద‌ని. పైగా సీమాంద్ర‌లో పార్టీ పూర్తిగా న‌ష్టపోవాల్సి వ‌స్తుంద‌ని లేఖ‌లో పేర్కొన్నారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పెడితే వ్యతిరేకిస్తామని, పార్లమెంటులో బిల్లును కూడా వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. ఈ లేఖ మై రాష్ట్ర మంత్రుల‌తో పాటు ఐదుగురు ఎంపిలు కూడా సంత‌కాలు చేసిన‌ట్టుగా స‌మాచారం.