విభ‌జ‌న ఆగ‌కుంటే కొత్తపార్టీ వ‌స్తుంది

 

రాష్ట్ర విభ‌జ‌న అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ఎంపి రాయ‌పాటి సాంబ‌శివ‌రావు స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న కాంగ్రెస్ అధిష్టానం పై మండిప‌డ్డారు. అంతేకాదు సెప్టెంబ‌ర్ 7న ఏపిఎన్జీవోలు త‌ల‌పెట్టిన స‌భ‌కు త‌న పూర్తి మ‌ద్దతు ఉంటుంద‌ని కూడా ప్రక‌టించారు రాయ‌పాటి.

ఎక్కువ రోజులు సీమాంద్రలో ఉద్యమాలు జ‌ర‌గ‌వ‌న్న ఆలోచ‌న‌తోనే అధిష్టానం విభ‌జ‌న దిశ‌గా అడుగులు వేస్తుంద‌ని, కాని ఇక్కడ ప‌రిస్థితులు అలా లేవ‌ని విభ‌జ‌న ఆగే వ‌ర‌కు కేంద్రం త‌న నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకునే వ‌ర‌కు సీమాంద్రలో ఉద్యమాలు ఆగ‌వ‌ని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయ‌కులు రాజీనామ‌లు చేసి ఉద్యమంలోకి వ‌స్తే మ‌రింత త్వర‌గా త‌మ ల‌క్ష్యం నెర‌వేరుతుంది అన్నారు.

అంతేకాదు విభ‌జ‌న విష‌యంలో కేంద్ర పున‌రాలోచించ కుంటే సీమాంద్రలో కాంగ్రెస్ పార్టీ ఉండ‌ద‌ని ఇక్కడి నాయ‌కులు కొత్త పార్టీని చూసుకోక త‌ప్పద‌ని కూడా అన్నారు.