మాణిక్యం స్థానంలో పైల‌ట్‌?

తెలంగాణా కాంగ్రెస్ పార్టీకి కోమ‌టిరెడ్డి గోపాల్‌రెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి చేరిన‌ప్ప‌టి నుంచి పార్టీలో అంతా ఖంగారుగానే ఉంది. తెలంగాణాలో టిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొని నిల‌వ‌డానికి పార్టీ మ‌రింత ప‌టిష్ట చేయ‌డంలోనూ తెలంగాణా ఇన్ ఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్ ఆశించినంత ప‌టిష్ట వ్యూహాలేమీ వేయ‌డం లేదు. దీనికి తోడు ఆయ‌న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పార్టీ నాయ కుల‌ను అంద‌రినీ స‌మానంగా చూస్తూ, అంద‌రి అభిప్రాయాలు తెలుసుకుని ముంద‌డుగు వేయ‌ డంలోనూ వెన‌క‌బ‌డి పోతున్నార‌న్న అభిప్రాయాలే విన‌వ‌స్తున్నా య‌ ని విశ్లేష‌కులు మాట‌. ఆయ‌న మీద అనేక ఫిర్యాదులు ఇప్ప‌టికే కాంగ్రెస్ అధిష్టానానికి చేరాయి. ఆయ‌న కేవ‌లం పీసీసీ అధ్య‌క్షుడితో త‌ప్ప వేరే నేత‌ల‌ను ప‌ట్టించుకోవ‌డంలేద‌న్న అభిప్రా యాలు ఉన్నాయి. 

పార్టీ నాయ‌కుల్లో ఆయన ప‌ట్ల తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతోంది. మునుగోడు కేంద్రందంగా  బీజేపీ వ్యూహ‌ర‌చ‌న‌తో ముంద డుగు వేస్తుంటే, తెలంగాణా కాంగ్రెస్ నాయ‌కుల‌కు స‌రైన సూచ‌న‌ల‌నిస్తూ ఉత్సాహ‌ప‌ర్చ‌కుండా, వారి అభిప్రాయాల‌ను లెక్క‌ లోకీ తీసుకో కుండా కేవ‌లం పీసీసీ అధ్య‌క్షుడితోనే చ‌ర్చిస్తూండ‌డం ప‌ట్ల నాయ‌కులు మండిప‌డుతున్నారు. మాణిక్యం ఠాగూర్ వ్య‌వ‌హార శైలి తో చాలామంది నాయ‌కులు విసిగెత్తి పార్టీని వదిలేసి వెళ్లే ఆవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయ‌ని ఇప్పటికే కొంద‌రు సీనియ‌ర్లు ఢిల్లీకి ఫిర్యాదు చేసిన‌ట్టు తెలుస్తున్న‌ది. 

ఈ సమయంలో మాణిక్కం ఠాగూర్‌ను మార్చి సీనియర్‌ కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌కు గానీ మరో నేతను గానీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి మాణిక్యం  వైఖరివల్ల పార్టీ మారాల్సివచ్చిందని తెలుస్తోంది. అనేకమంది నేతలు ఢిల్లీలో సీనియర్‌ నేతలకు ఫోన్లు చేస్తున్నా రని, దీనితో ఠాగూర్‌ ఏమి చేస్తున్నారని ఢిల్లీ పెద్దలు ప్రశ్నించి నట్లు తెలిసింది. కాగా ప్రియాంక రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమిస్తారన్న వదంతులు ఉన్నాయి. అయితే అది ఎంత‌వ‌ర‌కూ సాకార‌మ‌వుతాయ‌న్న‌ది అనుమాన‌మే.