రైతు భరోసా సొమ్ములు స్వాహా చేసిన వైసీపీ నాయకులు

రైతే రాజు అని మాటలకే సరిపెడుతుంది అధికార పక్షం. అధికారం చేతిలొ ఉందటంతో తాము ఆడిందే ఆట పాడిందే పాట అనే ధోరణి వైసిపి నేతల్లో రోజు రోజుకూ ఎక్కువవుతోంది. కౌలు రైతుల పేరుతో రైతు భరోసా సొమ్మును స్వాహా చేశారు. ఫిర్యాదుపై ఈ  విచారణ జరిపిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు తహసీల్దారు. దీనిపై వైసీపీ స్థానిక నేతలు మండిపడుతున్నారు. కూడేరు మండలంలో భూ యజమానులకు తెలియకుండా కౌలు రైతుల పేరుతో జాబితా తయారు చేసి.. రైతు భరోసా పథకం లబ్ధి పొందారు. కౌలు రైతుల జాబితాలో పేర్లు ఉన్న వారికి పదిహేను వందల రూపాయలు చేతులో పెట్టారు.

మిగిలిన పది వేల రూపాయలను మండలానికి చెందిన నలుగురు వైసీపీ నేతలు కాజేశారు. తమ భూముల పేరుతో ఇతరులు కౌలు రైతులుగా రైతు భరోసా లబ్ధి పొందిన విషయం తెలుసుకున్న బాధిత రైతులు మండల తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు.కౌలు రైతులుగా జాబితాలో ఉన్నవారు కూడా పదిహేను వందలు ఇచ్చి మిగిలిన సొమ్ము గ్రామానికి చెందిన నలుగురు వైసీపీ నేతలు దిగమింగారు అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ బాధితులకు హామీ ఇచ్చారు.

అక్రమాలకు పాల్పడిన అంశాలను సమగ్రంగా విచారణ జరిపి కలెక్టర్ కు నివేదిక పంపుతామని గ్రామస్తులు కౌలు రైతులు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి సంబంధిత  అధికారులపై చర్యలు తీసుకుంటానని బాధితులకు తెలిపారు. వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా పదుల సంఖ్యలో తహసీల్దారు చాంబర్ లోకి వెళ్లి తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేశారు. తమ వారి పేర్లు ఎందుకు బయటకు వెల్లడించారంటూ దురుసుగా ప్రవర్తించారు. ఓ దశలో తహసీల్దారుపై దాడి చేస్తారేమోనన్న అంతా వాతావరణం చాంబర్ లో ఏర్పడింది. దీంతో ఆందోళనకు గురైన తహసీల్దార్ తెల్లకాగితంపై తాను వివరాలు వెల్లడించలేదంటూ రాసిచ్చారు.