TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ: ఏం చర్చించారో తెలుసా.?

Published on: Sun Nov 15, 2026 4:00PM

తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి   నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో రేవంత్ రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు అలాగే రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన  ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు హాజరుకావాల్సిందిగా ప్రధాని మోదీని ముఖ్యమంత్రి  ఆహ్వానించారు.

అంతే కాకుండా రాష్ట్రంలో నిర్వహించనున్న  ఖేలో ఇండియా యూత్ గేమ్స్' ఏర్పాట్లకు సంబంధించి  ప్రధానికి వివరించారు. తెలంగాణ వేదికగా జరగనున్న ఈ క్రీడా  సమ్మిట్‌ ను ప్రారంభించాల్సిందిగా మోడీని కోరారు. 

ఇంకా సాగునీటి ప్రాజెక్టులు,  అనుమతులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై కూడా రేవంత్ రెడ్డి ఈ భేటీలో మోడీ వద్ద ప్రస్తావించారు.రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నుంచి మరింత సహకారం అందించాలని కోరారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రధానికి వివరించారు.

తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ఈ సమావేశంలో సానుకూల చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఇదికూడా చదవండి:  తెలంగాణ సీఎం రేవంత్ కు ప్రధాని మోడీ బంపరాఫర్.. ఏంటో తెలుసా?

క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ భేటీ కారణంగా భవిష్యత్తులో  కేంద్ర, రాష్ట్ర సంబంధాలు మరింత బలపడటంతో పాటు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి వేగవంతమైన ఆమోదాలు లభించే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

 మీకు నచ్చవచ్చు:   సీఎం రేవంత్‌రెడ్డికి ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు..ప్రత్యేక లేఖ రాసిన ప్రధాని మోదీ.!

జనసేన తెలంగాణ ఎంట్రీ వెనుక ప్రధాని మోడీ?

 [RevanthReddy,  Modi, Invest Telangana,  Global Summit, Khelo India TeluguOne]