Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ సీఎం రేవంత్ కు ప్రధాని మోడీ బంపరాఫర్.. ఏంటో తెలుసా?
posted on: May 11, 2026 11:21AM

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ పర్యటనలో భాగంగా మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో వేదిక పంచుకున్నారు. ఆ వేదికపై నుంచి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఇంతకీ ఆయనేమన్నారంటే.. తాను ప్రధాని హోదాలో తెలంగాణకు అన్ని విధాలుగా సహకరిస్తాననీ, అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనతో చేతులు కలపాలనీ అన్నారు.
మోడీ వ్యాఖ్యలకు అదే వేదికపై ఉన్న రేవంత్ రెడ్డి చిరునవ్వు నవ్వారు. మోడీ కూడా ఈ మాటలు నవ్వుతూనే అన్నప్పటికీ.. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తెలంగాణ సీఎం తనతో చేతులు కలపితే.. పూర్తి స్థాయిలో సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రధాని రేవంత్ కు ఇచ్చిన ఆఫర్ సంచలనం రేపింది. రేవంత్ ను బీజేపీలో చేరమని ప్రధాని కోరుతున్నారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
అయితే చాలా క్యాజువల్ గా ప్రధాని బహిరంగ వేదికపై నుంచి చేసిన ఈ వ్యాఖ్యలకు పెద్ద ప్రాధాన్యత లేదని పరిశీలకులు అంటున్నారు. మోడీ ఉద్దేశం దేశ సమగ్రాభివృద్ధిలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి తనకు మద్దతుగా నిలవాలనీ, అందుకు ప్రతిగా తెలంగాణ అభివృద్ధికి తాను పూర్తిగా సహకరిస్తాననీ చెప్పడమే ఆయన ఉద్దేశమని అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ను తొలిసారిగా అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్లో ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఆయన ఇప్పటికే కాంగ్రెస్లో ఒక బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. అలాగే కాంగ్రెస్ హైకమాండ్ విశ్వాసాన్నీ చూరగొన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ తన విధేయతను బీజేపీవైపు మార్చుకుంటారనడం పూర్విగా నిర్హేతుకం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.






