రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి
posted on Sep 16, 2024 5:35PM
తెలంగాణ సచివాలయం దగ్గర మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గాంధీ కుటుంబం దేశానికి చేసిన త్యాగాలు మరువలేనివని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ గూర్చి కొందరు చిల్లరగా మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా కూతురు ఇందిరాగాంధీ ఎటువంటి పదవులు అనుభవించలేదన్నారు. కొందరు సన్నాసులు వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. తెలంగాణ తల్లి విగ్రహంకు బదులుగా రాజీవ్ విగ్రహావిష్కరణ ఏమిటి అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావ్ ప్రశ్నించారు.