జగన్ నోటి దూల.. కారణం అదేనా పాపం.!!

'నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది' అనే సామెత వినే ఉంటారు.. పాపం జగనే ఈ సామెత వినలేదు అనుకుంటా.. నోరుజారి మరీ విమర్శల పాలవుతున్నారు.. 'పవన్ కళ్యాణ్ కు నలుగురు భార్యలు.. కార్లను మార్చినట్టు భార్యలను మారుస్తున్నాడు' అంటూ పవన్ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న జగన్.. అది మరువక ముందే కాపు రిజర్వేషన్ల గురించి నోరుజారారు.

 

 

రిజర్వేషన్ల అంశం మన చేతుల్లో ఉండదు, కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి అంటూ చేతులెత్తేశారు.. ఇంకేముంది ఈ వ్యాఖ్యల పట్ల జగన్ మీద అన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.. ప్రత్యేకహోదా అంశం కూడా కేంద్రం పరిధిలోనే ఉంటుంది.. అయినా సాధించడం కోసం పోరాడుతున్నాంగా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.. దీంతో వెంటనే జగన్ మాట మార్చి కాపు రిజర్వేషన్లకు అనుకూలమే అన్నారు.. అసలు జగన్ కి ఏమైంది?.. ఎందుకిలా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు?.. ఎందుకిలా రోజుకో మాట మారుస్తున్నాడు? అంటూ ఆయన సొంత పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు.. కానీ జగన్ ఇలా నోరుజారడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయట పాపం.. సర్వేలన్ని జగన్ కి వ్యతిరేకంగా వస్తున్నాయి.. మరోవైపు ఉండవల్లి లాంటి సీనియర్ నేతలు చంద్రబాబుని కలుస్తున్నారు.. కలవడం వరకు ఓకే.. కలిసిన తరువాత చేసే వ్యాఖ్యలే జగన్ కి బాధ కలిగిస్తున్నాయి.. ఉండవల్లి మాట్లాడుతూ చంద్రబాబుని ఓడించడం జగన్ వల్లకాదు అనేసారు.. ఓ వైపు సర్వేలు, మరోవైపు సీనియర్లు ఇలా అన్నింటా జగన్ కి ఓటమి తప్పదని పదే పదే వింటుంటే.. పాపం ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏం అనాలో? ఎవర్ని అనాలో? ఏం మాట్లాడాలో? ఎందుకు మాట్లాడాలో? ఏం తెలియక.. ఏది పడితే అది మాట్లాడుతూ, ఎవరిని పడితే వారిని అంటూ చివరికి ఎటూ కాకుండా అయిపోతున్నాడు.