అత్యాచారయత్నం మాత్రమే జరిగిందని తేల్చిన డాక్టర్ల...

దిశా ఘటన జరిగి పూర్తిగా మరవక ముందే కనీసం ఎక్కడో ఒక్క చోట అయినా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.కేవలం ప్రజల్లో మార్పు మాత్రమే ఇలాంటి ఘటనలను అంతం చేయగలదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దంపతులు రెండేళ్ల క్రితం వాణినగర్ కు వచ్చి నివసిస్తున్నారు. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో పనికి కుదిరారు. శ్రీకాకుళం జిల్లాలో అమ్మమ్మ వద్ద ఉంటున్న వీరు కుమార్తె పది రోజుల క్రితం వాణినగర్ కు వచ్చింది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో బాలిక ఇంటి సమీపంలోని ఓ కిరాణా దుకాణానికి వెళ్లింది. అక్కడి నుంచి ఆమెను ఓ యువకుడు బైక్ మీద ఎక్కించుకుని నిర్మానుష్యంగా ఉండే చక్రపురి అనే ప్రాంతానికి తీసుకెళ్లగా, కొద్దిసేపటికీ కార్లో మరో ముగ్గురు యువకుల చేరుకున్నారు ఆమె నుంచి సెల్ ఫోన్ లాక్కుని దూరంగా విసిరేసి నిర్బంధించి అత్యాచారానికి ప్రయత్నించగా అంతలో ఆ వైపు మరో కారు రావడాన్ని చూసి యువకులు పారిపోయినట్లు సమాచారం.

తన సెల్ ఫోన్ నుంచి బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిన ధారుణం గురించి చెప్పింది. మొదట తన పై నలుగురు యువకు లు అత్యాచారం చేశారంటూ పోలీసులకు బాలిక తెలిపింది. ఆమెను వైద్యపరీక్ష నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పై అత్యాచారం జరగలేదని వైద్యులు తేల్చారు. బాలికను మరోసారి ప్రశ్నించగా మాట మార్చింది. తన పై గుర్తు తెలియని నలుగురు యువకులు అత్యాచారయత్నం చేశారని ఆ వైపు రావడంతో వదిలేసి పారిపోయారు అని తెలిపింది. ఈ ఘటన పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.నిందితులను పట్టుకునేందు కు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కాలనీలో గురువారం విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిసి కెమెరాలు పని చేయలేదు కావున ఇళ్ళ వద్ద ఏర్పాటు చేసిన కెమెరాను విశ్లేషిస్తున్నామని పోలీసు అధికారులు తెలియజేశారు.