రాహుల్ పై బూటు విసిరిన వ్యక్తి...

 

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లు నిర్వహిస్తుంది. అలాగే రాహుల్ గాంధీ ఈ రోజు ఉత్తరప్రదేశ్లో లోని సీతాపూర్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో పాల్గొన్న రాహుల్ గాంధీ పై ఓ దుండగుడు బూటు విసిరాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బూటు విసిరిన దుండగుడిని అరెస్ట్ చేశారు.