తెలంగాణ నుంచి రాహుల్‌ పోటి

 

వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ అధిష్టానం అందుకు తగ్గట్టుగానే ప్రణాళిక రూపొందిస్తుంది. ముఖ్యంగా రాహుల్‌ ప్రదానిని చేసే దిశగా ఈ ప్రణాళికా రచన సాగుతుంది. అందుతో భాగంగానే రాహుల్‌ను తెలంగాణ ప్రాంతం నుంచి పోటికి దించాలని భావిస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగంగా పూర్తి చేసే ఆలోచనలో ఉంది కాంగ్రెస్‌.

అందుకోసం ఈసారి రాహుల్‌ మహుబూబ్‌ నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటి చేసేందుకు రాహుల్‌గాంధిని ఒప్పించాలంటే డీసిపి బృందం రాహుల్‌ సన్నిహితులను కొరారు.ప్రస్తుతం కేంద్రం తెలంగాణకు అనుకూలంగా పావులు కదుపుతున్న నేపధ్యంలో రాహుల్ తెలంగాణ నుంచి పోటి చేస్తే అది పార్టీకి రాష్ట్రంలో కేంద్రలో ప్లస్‌ అవుతుందని భావిస్తున్నారు. దీని వల్ల తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రాభవాన్ని పెంచుకోవటంతో పాటు టిఆర్‌ ఎస్‌ బలాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారట కాంగ్రెస్‌ నాయకులు.