వాయు కాలుష్యంపై పార్లమెంటులో చర్చకు రాహుల్ డిమాండ్
posted on Nov 28, 2025 5:11PM
.webp)
దేశంలోని ప్రధాన నగరాలలో వాయుకాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరడంపై లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నగరాలలో వాయుకాలుష్యంపై పార్లమెంటులో చర్చజరగాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చే నెల మొదటి తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ వేదిరగా రాహుల్ గాంధీ ఈ డిమాండ్ చేశారు.
వాయుకాలుష్య సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రణాళికా లేదని దుయ్యబట్టారు. దేశంలో పిల్లలు వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ప్రధాని మోడీ మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారని నిలదీశారు. పిల్లల భవిష్యత్, ఆరోగ్యం విషయంలో జవాబు దారీతనం ఉండాలన్న రాహుల్ గాంధీ వాయుకాలుష్యంపై పార్లమెంటులో చర్చించి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కఠినమైన, ఆచరణసాధ్యమైన ప్రణాళిక అవసరమని నొక్కి చెప్పారు.