క్వాంటం వ్యాలీ ముందు తీసికట్టు సిలికాన్ వ్యాలీ!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీని అమెరికాలోని సిలికాన్ వ్యాలీని మరిపించేలా తీర్చిదిద్దనుంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. క్వాంటం వ్యాలీ అత్యధునిక సాంకేతికలకు నిలువెత్తు నిదర్శనంగా ఉంటేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.  సిలికాన్ వ్యాలీ తీసికట్టు అయ్యే విధంగా దేశంలోనే మొదటి టెక్నాలజీ వ్యాలీగా  క్వాంటం వ్యాలీని తీర్చి దిద్దాలన్న లక్ష్యంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.

1990లలో ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నట్లే.. ఇప్పుడు క్వాంటం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్ ఏర్పాటు తొలి అడుగు వేయాలన్నది చంద్రబాబు లక్ష్యంగా చెబుతున్నారు.  క్వాంటం వ్యాలీ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ముందు ముందు కనీసం 15లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంటున్నారు. క్వాంటం వ్యాలీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 50 ఎకరాలను కేటాయించిన సంగతి తెలిసిందే.  

క్వాటం మిషన్ పేరిట బుధవారం విజయవాడలో నిపుణులతో వర్క్ షాప్ జరిగింది. మొత్తం మీద సాంకేతిక అద్భుతంగా క్వాంటం వ్యాలీ రూపుదిద్దుకోబోతున్నది. క్వాంటం వ్యాలీ ప్రత్యేకతలను చాటే విధంగా నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఒక ఐకానిక్ టవర్ ను నిర్మించేందుకు చంద్రబాబు సర్కార్ ప్రణాళికలు రూపొందించింది. వచ్చే ఏడాది జనవరి 1న క్వాటం వ్యాలీని ప్రారంభించేందుకు ఇప్పటికే ముహూర్తం కూడా ఖరారైంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu