పులివెందుల ఓట‌మితో..ప‌రాజ‌యం ప‌రిపూర్ణ‌మ‌య్యిందా భార‌తీ!

 

అవి ఎమ‌ర్జెన్సీ  త‌ర్వాతి కాలం  రోజులు.. అప్పుడు వైఎస్‌ఆర్ ఏమంత గొప్ప ఇందిరాగాంధీ కుటుంబ భ‌క్తుడు కాడు. పైపెచ్చు కుటుంబ పాల‌న‌కు సంబంధించి తీవ్రంగా దుయ్య‌బ‌డుతూ ఉండేవారాయ‌న‌. ఆ సమయంలో.. ఒరిజిన‌ల్ కాంగ్రెస్ నుంచి ఇందిర‌ను, ఆమె చిన్న కుమారుడు సంజ‌య్ గాంధీని బ‌హిష్క‌రించ‌గా.. అప్ప‌టికే సిద్ధం చేసి  పెట్టుకున్న ఇండియా అంటే ఇందిర- ఇందిర అంటే ఇండియా అనే ఒకానొక స్లోగ‌న్ కొద్ది.. ఆమె ఎక్క‌డుంటే అదే కాంగ్రెస్ అనే కోణంలో కాంగ్రెస్ ఐ స్థాప‌న‌.. ఆపై వైయ‌స్ ఆర్ ఒరిజిన‌ల్ కాంగ్రెస్ నుంచి గెలుపు. 

స‌రిగ్గా అదే స‌మ‌యంలో వైయ‌స్ ఒకే ఒక్క‌డుగా ఉమ్మ‌డి ఆంధ్ర‌లో గెలిచిన‌.. ఆ ఒక్క సీటు గ‌ల ఒరిజిన‌ల్ కాంగ్రెస్ కాస్తా కాంగ్రెస్ ఐలో చేర‌డంతో.. ఆయ‌న కూడా కాంగ్రెస్ ఐ కి షిఫ్ట్ అయ్యారు. ఆనాటి  నుంచి పులివెందుల‌లో వైయ‌స్ లేదా ఆయ‌న కుటుంబ ప్రాతినిథ్య పార్టీ వైయ‌స్ఆర్సీపీ విజ‌యం సాధిస్తూ వ‌చ్చాయి. అక్క‌డ పూచిక పుల్ల‌ను నిల‌బెట్టినా.. కూడా వైయ‌స్ కుటుంబం పేరు మీద  నిలిచి గెలిచేదనే పేరుంది.

అలాంటి చ‌రిత్ర‌కు చెద‌లు పట్టిందా? అన్న‌ట్టు నేడు పులివెందుల‌లో టీడీపీ జెండా రెప‌రెప‌లాడింది. అలాగ‌ని అదిప్ప‌టి నుంచే కాదు గ‌త రెండు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ ఈ ప్రాంతంలో వైయ‌స్ కుటుంబం ప‌వ‌రు త‌గ్గిందా? అన్న‌ట్టు ప‌రిస్థితి మారుతూ వ‌చ్చింది. గ‌త 2024 ఎన్నిక‌ల్లో క‌డ‌ప‌లోనూ వైసీపీ భారీ  ప‌రాభ‌వం మూట‌గ‌ట్టుకుంది.  

దీనంత‌టికీ  కార‌ణం వైయ‌స్ కుటుంబ లెగ‌సీని వైయ‌స్ జ‌గ‌న్ దిగ‌జార్చుతూ వ‌చ్చార‌న‌డానిక‌న్నా.. మించి భార‌తీరెడ్డి ఈ క్ర‌తువును ముందుండి న‌డిపిస్తున్నారా? అనిపిస్తోంది. కార‌ణం.. భార‌తీ రెడ్డి జ‌గ‌న్ ని అడ్డు పెట్టుకుని వైయ‌స్ఆర్ బ్రాండ్ ని త‌మ కుటుంబం అంటే తాను, అవినాష్ రెడ్డి ప్రాతినిథ్యం వ‌హించే సెకండ్ గ్రేడ్ వైఎస్ ఫ్యామిలీకి అడాప్ట్  చేసుకోవాల‌న్న త‌లంపు కార‌ణంగా ఆమె.. తీసుకుంటూ వ‌స్తున్న నిర్ణ‌యాలు వ‌రుస వెంబ‌డి బెడిసి కొడుతూ వస్తున్నాయి. 

కుప్పం మున్సిపాల్టీల‌తో విజ‌యం సాధించిన ఆ ఊపు ఉత్సాహం కాస్తా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక‌ల గెలుపుతో మ‌ట్టికొట్టుకుపోవ‌డం మాత్ర‌మే కాదు.. వైయ‌స్ ఫ్యామిలీకున్న ప్ర‌భ నానాటికీ త‌గ్గుతూ వ‌స్తోంద‌న‌డానికి ఒక నిద‌ర్శ‌నంగా నిలుస్తోందని అంటారు విశ్లేష‌కులు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu