బ్యాంకు ఉద్యోగుల సమ్మె ప్రశాంతం

 

దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. వేతన సవరణపై ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది ఆందోళన బాటపట్టి బుధవారం నాడు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఈ ఒకరోజు సమ్మె ప్రశాంతంగా జరుగుతోంది. దీనివల్ల దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లోని కోఠీలో బ్యాంకు ఉద్యోగులు మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్‌ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది నిరసనకు దిగారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బ్యాంకు ఉద్యోగులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. వేతన సవరణ చేసి తమ సమస్యలను పరిష్కరించాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకుల సమ్మె కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. బ్యాంకుల సమ్మె విషయం తెలియని జనం ముఖ్యమైన పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్ళి తాళాలు వేసి వుండటంతో వెనుదిరుగుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా అనేక ఏటీఎంలలో నగదు నిల్వలు ఖాళీ అయిపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ బ్యాంకులు మాత్రం తెరిచే వున్నాయి.