గర్భవతి అని కూడా చూడకుండా... ఆటోలో రేప్

అది హర్యానలోని మనేశర్‌ అనే ఊరు. దేశ రాజధానికి చాలా దగ్గరగా ఉండే మనేశర్‌లో కొన్ని వందల కంపెనీలు కనిపిస్తాయి. దేశ ప్రగతికి కావల్సిన ముడిపదార్థాలని అందిస్తాయి. అలాంటి ఊరిలోనే ఓ 21 ఏళ్ల గర్భవతి మీద అత్యాచారం జరిగింది. ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన పాపానికి, ఆమెకు మత్తుమందు ఇచ్చి మరీ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆటో డ్రైవర్‌ సాయంతో, ఆటోలో అంతకు ముందే ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ పాపానికి ఒడిగట్టారు. స్పృహ లేని పరిస్థితిలో ఉన్న బాధితురాలిని ఊరికి దూరంగా విసిరిపారేశారు.