జగన్ విశాఖ పర్యటనకు పోలీసుల రూట్ మ్యాప్
posted on Oct 9, 2025 9:41AM

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించనున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయనీ పర్యటన చేపట్టారు. అయితే నేడు విశాఖలో మహిళల ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ జరగనున్నందున కాన్వాయ్ లో 10కి మించి వాహనాలు ఉండకూడదని, రోడ్ షో నిర్వహించడం, కూడళ్ల వద్ద ప్రసంగాలు చేయకూడదని ఆయన పర్యటనకు పోలీసులు షరతులు విధించారు.
జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చిన పోలీసులు వైసీపీ ప్రతిపాదించిన మార్గంలో కాకుండా కొత్త రూట్ మ్యాప్ ఇచ్చి, దాని ప్రకారమే పర్యటన సాగాలని కండీషన్ పెట్టారు. పోలీసులు నిర్దేశించిన మార్గం ప్రకారం విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ఎన్ఏడీ జంక్షన్, పెందుర్తి కూడలి మీదుగా అనకాపల్లి, తాళ్లపాలెం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. నిర్దేశించిన మార్గంలో, నిబంధనలకు లోబడే జగన్ పర్యటన సాగాలని పోలీసులు స్పష్టంగా ఆదేశించారు.