మాజీ ప్ర‌ధాని మనవడు ప్రజ్వల్ శృంగార లీలలుః మోదీ మౌనం

మాజీ ప్ర‌ధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ శృంగార లీలలు, సెక్స్ స్కాండల్ కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి, వాటి ఆధారంగా వారిని బెదిరించి ప్రజ్వల్ రేవణ్ణ లొంగదీసుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. హసన ఎంపీ, JDS యువనేత ప్రజ్వల్  మాజీ ప్రధాని దేవెగౌడకు స్వయానా మనవడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్న కుమారుడైన ప్రజ్వల్.. యువతులను ప్రలోభాలకు గురిచేసి, లైంగిక దాడి చేశారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేగింది. 

తాజాగా ఈ కేసులో మరో సంచలనం బయటపడింది. ప్రజ్వల్‌పై లైంగిక దాడి కేసు పెట్టిన బాధిత మహిళ (47).. ఆయనకు బంధువే. ప్రజ్వల్ తల్లి భవానీకి ఆమె మేనత్త కుమార్తె.   అమ్మ ఇంట్లో లేని సమయంలో.. రేవణ్ణ మంత్రిగా ఉన్నప్పుడు బాధిత మహిళకు పాల కేంద్రంలో పని ఇప్పించారు. అనంతరం బీసీఎం హాస్టల్‌లో వంట మనిషిగా అవకాశం కల్పించారు. 2015లో ఆమెను వారి ఇంట్లో పనికి చేర్పించారు. రేవణ్ణ నివాసంలో ఆరుగురు మహిళలు, యువతులు పని చేస్తున్నారని బాధిత మహిళ కంప్లెయింట్‌లో పేర్కొంది. ఇంట్లో చేరిన 4 నెలల నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నాడ‌ని, తల్లి ఇంట్లోలేని సమయంలో తనపై లైంగిక దాడి చేసేవాడని బాధితురాలు ఆరోపించింది. తన కుమార్తెకు కూడా వీడియో కాల్‌ చేసి ప్రజ్వల్‌ అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది.  

ప్రజ్వల్ రేవణ్ణ కర్ణాటకలోని హసన్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేశారు. ఏప్రిల్ 26న కర్ణాటకలో  14 సీట్లకు పోలింగ్ జరిగిన స్థానాలలో హసన్ సీటు కూడా ఒకటి. ఇక్కడ పోలింగ్ జరిగిన తర్వాత రేవణ్ణపై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. హసన్ జిల్లాలో అసభ్యకర వీడియోలు సర్క్యూలేట్ అయ్యాయి. ఈ వీడియోల ద్వారా మహిళలపై లైంగిక వేధింపు ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది . ఒకవేళ అది కుంభకోణం అయితే, ప్రస్తుతం అంత పెద్ద ప్రభావం చూపకపోవచ్చు. ఎందుకంటే, ఇప్పటికే ఓటింగ్ పూర్తయింది. ఆరోపిత వీడియోలున్న పెన్ డ్రైవ్‌లు కేవలం హసన్ నగరంలో మాత్రం సర్క్యూలేట్ అయ్యాయి. కర్ణాటకలో తొలి దశ ఓటింగ్‌పై ఎలాంటి ప్రభావం లేదు. కానీ, మిగిలిన 14 సీట్లలో మహిళా ఓట్లను ఆకర్షించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తే, అప్పుడు నైతికంగా బీజేపీని సవాలు చేయగలదు.

సెక్స్‌ స్కాండల్‌ ఆరోపణల నేపథ్యంలో  ప్రజ్వల్‌ జర్మనీ పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఒకవేళ ప్రజ్వల్‌ విదేశాలకు వెళితే అతడిని వెనక్కు తీసుకువచ్చి విచారణ కొనసాగించే బాధ్యత సిట్‌దేనని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర తెలిపారు.

ఈ కుంభకోణం బీజేపీకి ఒక అస్త్రంగా మారింది. భవిష్యత్‌లో జేడీఎస్‌ను శాసించేందుకు వీలు కల్పించనుంది.  జేడీఎస్ పార్టీని బీజేపీ కబళించడానికి ప్ర‌య‌త్నిస్తోంది. ఈ 'సెక్స్ స్కాండల్'  జేడీఎస్ ముగింపుకు చివరి దశకు తీసుకొచ్చింది. బీజేపీ నుంచి జేడీఎస్ వేరుకావడానికి ఇది దారితీస్తుంది. ఒకవేళ ఇలానే జరిగితే, జేడీఎస్ నేతలలో ఆందోళన చెలరేగి, వారు బీజేపీలో చేరతారు.  

- ఎం.కె.ఫ‌జ‌ల్‌