కాకతీయ వారసత్వాన్ని కాపాడుకోవాలి: ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో.!
Published on: Wed Nov 25, 2026 8:50AM

నాగర్కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ పదర మండలాల్లోని కాకతీయుల కాలపు వారసత్వాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.
ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో భాగంగా ఆయన మంగళవారం (నవంబర్ 24) అమ్రాబాద్, ఉడుమిల్ల పరిసరాల్లో పర్యటించారు. అమ్రాబాదు శివాలయంలో కాకతీయుల కాలపు అత్యంత కళాత్మకమైన నంది విగ్రహం, ఆలయం వెనుక, ప్రాకారంగోడ పక్కనే మట్టిలో కూరుకు పోయిందన్నారు.
తలభాగంలో భిన్నమైన, నునుపైన నల్లశానపు రాతి నంది వంటి పైఆభరణాలు ఆకర్షణీయంగా ఉన్నాయని, ఆ విగ్రహాన్ని పీఠంపై నిలబెట్టాలని, ఆలయపాలక వర్గానికి విజ్ఞప్తి చేశారు.

అలాగే, స్థానిక రామాలయంలో పంచముఖ శివుని తలభాగం మాత్రమే మిగిలి ఉందని, సా.శ.13వ శతాబ్దికి చెందిన ఈ శిల్పంలో వరుసగా నాలువైపులా నాలుగు తలలు, ప్రధాన తలపై ఐదోతల, అన్ని తలలపై జటామకుటాలు, ముఖంపై మూడోకన్ను ఆవిగ్రహం శివునిదేనని తెలియజేస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: రొంపిచర్ల చారిత్రక ఆనవాళ్లను కాపాడాలి
ఆ తలలు సద్యోజాత, ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవులను సూచిస్తున్నాయన్నారు. పదర సమీపంలోని ఉడుమిల్ల గ్రామ శివారు అడవిలో గల ఉడుమీశ్వర ఆలయం శిథిలమైందన్నారు.

అక్కడి శివలింగాలు, నంది, భైరవశిల్పాలు భిన్నమైనాయని, కాకతీయుల కాలపు చారిత్రక ప్రాధాన్యతగల ఈ విగ్రహాలను కాపాడుకోవాలని శివనాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.
మీకు నచ్చవచ్చు:: ఆకట్టుకున్న డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్
సిద్దిపేట జిల్లాలో కాకతీయ గణపతిదేవుని శిల్పం గుర్తింపు
[PleachIndiaFoundation, CRO Emani, Sivanagireddy, Amrabad, Kakateeya, Heritage, TeluguOne]


