ఏపీ 'ఆమ్ ఆద్మీ' పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..!!

 

Pawan to join Aam Aadmi Party, Arvind Kejriwal, Pawan Kalyan, 2014 elections

 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా రంగంలో ఆయనకున్న క్రేజ్..అభిమానించేవారు కోకొల్లలు.. అందులోనూ పవన్‌ మేనియాలో కొట్టుమిట్టాడేవారు కూడా ఎక్కువే. ఇప్పుడు రాజకీయాలలో కూడా పవర్ స్టార్ సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారనున్నారు. పవన్‌ చుట్టూ రాజకీయాలకు సంబంధించిన గాసిప్స్‌ పూటకొకటి బయటకి వస్తున్నాయి.

 

గతంలో పవన్ కళ్యాణ్ టిడిపిలో చేరబోతున్నారని అని వార్తలు కూడా వచ్చాయి. కాని వాటిని ఆయన ఖండించలేదు గాని, ఆయన సోదరుడు నాగబాబు మాత్రం దానిని ఖండించారు. ఇప్పుడని కాదు..ఎప్పుడూ పవన్ తనపై వచ్చిన విమర్శలు కు, గాసిప్స్‌ కు స్పందించిన  దాఖలాల్లేవు.



అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  'ఆమ్ ఆద్మీ పార్టీ' లో చేరబోతున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కి పవన్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారని అంటున్నారు. దీనిపై రాష్ట్రంలో 'ఆమ్ ఆద్మీ పార్టీ' సర్వే కూడా చేసినట్టు సమాచారం. మొత్తమ్మీద, పవన్‌ రాజకీయాల్లోకి మళ్ళీ వస్తాడో రాడోగానీ, పవన్‌ పేరుతో గాసిప్స్‌ మాత్రం విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి.