నా తుండుకి కుల, మత బేధాలు తెలియవు

నేను ధరించిన ఈ ఎర్రకండువాకి కుల, మత, వర్గ, వర్ణ, భావ భేదాలు తెలియవన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో జరిగిన చేనేత గర్జన సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు. చేనేతను వాడుతున్నందుకు తాను గర్వపడుతున్నానన్నారు. పంచె మన సొత్తు అని..పంచె కట్టు కట్టినపుడు తనకెంతో సంతోషంగా గర్వంగా ఉంటుందని అన్నారు. పంచెకట్టు, చేనేత సామాన్యుడి శక్తి అన్నారు. ప్రజలంతా వారానికి ఒకరోజైనా చేనేత దుస్తులు ధరించాలని పిలుపునిచ్చారు.