వకీల్ సాబ్ చూస్తూ యువకుడు మృతి

గుంటూరు జిల్లాలో ఉగాది పర్వదినాన విషాదం చేటు చేసుకుంది.  తెనాలిలోని లక్ష్మి డీలక్స్ హాల్‌లో ‘వకీల్ సాబ్’ సినిమా చూస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. సినిమా చూస్తున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన ఇతర ప్రేక్షకులు థియేటర్ సిబ్బందికి తెలపగా..  అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడిని పరిశీలించిన డాక్టర్లు... మృతి చెందినట్టు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడికి సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నారు.