నేటి నుండి ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు

పార్లమెంటు సమావేశాలు మొదలయ్యాయి. వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ మరో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతోంది. మోడీ సర్కార్ రెండవసారి అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ సెషన్ నేటి నుంచి ప్రారంభం కానున్న నేపధ్యంలో  రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. నిర్మలా సీతారామన్ రేపు సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం రెండు విడతలుగా జరగనున్న ఈ శీతాకాల సమావేశాలు తొలి విడతలో ఫిబ్రవరి 11 వరకు జరుగనున్నాయి. అనంతరం మార్చి 2వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు రెండవ విడత సమావేశాలు జరగనున్నాయి. రెండు విడతల మధ్య ఫిబ్రవరి 12వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు విరామం ఉండనుంది. బడ్జెట్ లో వివిధ శాఖలకు కేటాయించిన నిధులను ఈ విరామంలోనే పార్లమెంటరీ కమిటీలు పరిశీలించనున్నట్లు సమాచారం. 

గతేడాది ఓటాన్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన మోదీ ప్రభుత్వం ఈ సారి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ( ఫిబ్రవరి 1వ తేదీన ) కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ ప్రభుత్వం రెండో దఫా అధికారంలోకి వచ్చాక ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సభాపర్వానికి పాలక ప్రతిపక్షాల అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా ఇప్పటికే సీఏఏ , ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నందున ఈ అంశం పై సభ దద్దరిల్లే అవకాశమున్నట్లు అంచనా. ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా సన్నద్ధమైంది.పార్లమెంటు సమావేశాలు ఏ స్థాయిలో ప్రజలకు మేలు చేకూర్చుతాయో వేచి చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu