పార్లమెంటు శీతాకాల సమావేశాలు సమాప్తం

 

ఈ నెల 20వరకు జరుగవలసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలను రెండు రోజుల ముందుగానే ఈరోజు ముగిసాయి. ఈ రోజు లోక్ సభలో లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందిన తరువాత పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు. అందువల్ల ఇక తెలంగాణా బిల్లు కోసం పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశమవవలసి ఉంటుంది. లేదా ఫిబ్రవరి నుండి మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టవలసి ఉంటుంది.

 

సమావేశాల ముగిసిన వెంటనే కాంగ్రెస్ యంపీ సబ్బంహరి మీడియాతో మాట్లాడుతూ, తాము చెప్పినట్లే తెలంగాణా బిల్లు పార్లమెంటు శీతాకాల సమావేశాలలో రాకుండా అడ్డుకోగాలిగామని, అందువల్ల ఇక బడ్జెట్ సమావేశాల వరకు టీ-బిల్లు పార్లమెంటుకు వచ్చే అవకాశం లేదని, ఒకవేళ వచ్చినా దానిని తాము ఇదేవిధంగా అడ్డుకొంటామని, ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన జరగనీయకుండా అడ్డుకొనేందుకు శతవిధాల ప్రయత్నిస్తామని ఆయన అన్నారు.