ముగిసిన తొలి సం’గ్రామం’

 

తొలిదశ సంగ్రామం ముగిసింది.. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష టిడిపి, వైయస్ఆర్ కాంగ్రెస్, టిఆర్ ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకం తీసుకున్న పంచాయితీ సమరంలో టిడిపినే గెలిచింది. భారీ వర్షాలు కురుస్తున్నా ప్రజలు మాత్రం పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 82.31 శాతం పోలింగ్ నమోదయింది. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా 90 శాతం... అన్నింటికంటే తక్కువగా ఆదిలాబాద్లో 60 శాతం పోలింగ్ నమోదైంది.


మధ్యాహ్నం వరకు పోలింగ్ కొనసాగగా తరువాత కౌంటిగ్ మొదలైంది. ఈ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగక పోయినా ఆ పార్టీలకు మద్దతు పలికే అభ్యర్ధుల గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్ధులు కూడా పార్టీ జెండాలతోనే ప్రచారం నిర్వహించారు.. ఒక్క ఎన్నికల సంఘం తప్ప మిగతా అంతా ఇవి పార్టీ పరంగా జరుగుతున్న ఎన్నికల గానే భావించారు..అందుకు అనుగుణంగా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేఖత స్పష్టంగా కనిపించింది.. పాలక పక్షంపై ఉన్న అసంతృప్తితో వైసిపి, టిఆర్ఎస్ల వైపు జనం వెళతారన్న ఆ పార్టీల ఆశలపై కూడా జనం నీళ్లు చల్లారు.. సీమాంద్రతో పాటు తెలంగాణలోనూ ప్రదాన పార్టీ కాంగ్రెస్ టిడిపిల మధ్యే సాగింది.. మెజారిటీ స్థానాల్లో టిడిపి ముందుగగా కాంగ్రెస్ రెండో స్ధానంలో నిలిచింది.. టిఆర్ ఎస్, వైసిపిలు మూడు నాలుగు స్థానాలతో సరిపెట్టుకున్నాయి.

తొలి విడత జరిగిన పంచాయితీల్లో 1650కి పైగా సర్పంచ్ స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు విజయబావుటా ఎగురవేయగా. 1520 గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. దాదాపు 1200 సర్పంచ్‌ స్థానాల్లో నెగ్గిన వైసీపీ మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణ పంచాయతీలో టీఆర్ఎస్ 430 స్థానాలు దక్కించుకుంది.