కేఏ పాల్‌కు పాలాభిషేకం

కేఏ పాల్. ఏపీ పాలిటిక్స్ లో కామెడీ పీస్ అంటారు ప్రత్యర్థులు. మాటలు, చేష్టలు కామెడీగా ఉన్నా.. తనలో స్ట్రాంగ్ కమిట్ మెంట్ ఉందనేది ఆయన వర్షన్. ఆంధ్రప్రదేశ్ లో మేజర్ న్యూస్ ఏదైనా ఉంటే వెంటనే విదేశాల్లోంచి వాలిపోతారు. ఎన్నికల సమయంలో ఏపీకి మకాం మార్చి నానా హడావుడి చేస్తారు. పెద్ద పెద్ద లీడర్లతో పోటీపడుతూ తన స్థాయినీ పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా, ఆయన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంలో జోక్యం చేసుకున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసు ఇంకా విచారణలో ఉంది. 

ఏపీ బంద్‌తో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమం హోరెత్తుతోంది. కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున బంద్ లో పాల్గొన్నారు. బంద్ లో భాగంగా విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు కూర్మన్నపాలెం జంక్షన్ దగ్గర కేఏ పాల్ చిత్ర పటానికి పాలిభిషేకం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్‌ వేసినందుకు పాల్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. విశాఖ ఉక్కు కోసం కేసు వేసి తనవంతు ప్రయత్నం చేస్తున్న కేఏ పాల్ కు పాలాభిషేకంతో కృతజ్ఞత తెలిపారు ఉక్కు కార్మికులు.