కేసీఆర్ మీద మీడియా ఆగ్రహం

 

తెలంగాణ రాష్ట్ర సచివాలయం లోపలకి మీడియాకు ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. వందలకొద్దీ వున్న మీడియా ప్రతినిధులు సచివాలయంలో మంత్రులు, అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారన్న అభిప్రాయంతో మీడియా పిలిచినప్పుడే సెక్రటేరియట్‌కి వచ్చేట్టు చేయాలని కేసీఆర్ భావించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీతో సహా కొన్ని రాష్ట్రాల సెక్రటేరియట్‌లలో మీడియా ప్రవేశానికి ఆంక్షలున్నాయి. ఇదే బాటలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూడా నడవాలని కేసీఆర్, అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలోచనలో వుందని తెలుసుకున్న మీడియా ప్రతినిధులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం ముందు తీవ్ర నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ప్రతినిధులతో సమావేశమై ఈ అంశం విషయంలో మీడియా ప్రతినిధులను ఒప్పించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.