TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మళ్లీ కోవిడ్ కలకలం: ప్రపంచాన్ని కమ్మేస్తున్న కొత్త వేరియెంట్.. ప్రమాదమెంత.?

Published on: Wed Nov 11, 2026 9:28AM

కోవిడ్ మహమ్మారి మరోసారి పంజా విసురుతోందా?  అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఔననే అంటున్నది. కోవిడ్ కొత్త వేరియెంట్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్నది. పీజే.2.1గా పిలవబడే ఈ కోవిడ్ కొత్త వేరియెంట్ తొలుత కెనడాలో వెలుగు చూసింది. అది ఇప్పుడు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా సహా పలు దేశాలలో విస్తరించింది. ఈ కోవిడ్ కొత్త వేరియెంట్ వ్యాప్తి వేగం విస్మయ పరుస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కొత్త వేరియెంట్ వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు, ముప్పు తదితర అంశాలపై అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు నిఘా పెట్టాయి. పరిశోధనలు చేస్తున్నారు.  నిరంతరం నిఘా ఉంచాయి.

ఈ ఏడాది మేలో కెనడాలోని ఆంటారియో ప్రాంతంలో కోవిడ్ కొత్త వేరియెంట్ PJ.2.1కి సంబంధించిన తొలి కేసు వెలుగు చూసింది. అక్కడ నుంచి ఇది అతివేగంగా  అల్బర్టా, బ్రిటిష్ కొలంబియా వంటి ప్రాంతాలకు విస్తరించింది. జూన్లో అగ్రరాజ్యానికి కూడా ఇది పాకింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కోవిడ్ కొత్త వేరియెంట్ తొలి నమోదు అయ్యింది.  ఆ తర్వాత కాలిఫోర్నియా, ఫ్లోరిడా వంటి  రాష్ట్రాలకు వ్యాపించింది. అక్టోబరు నాటికి ఆంటారియోలో సేకరించిన నమూనాల్లో 25 శాతానికి పైగా ఈ వేరియంట్ ఉండటంతో దీని వ్యాప్తి వేగం ఎంత తీవ్రంగా ఉందో తేటతెల్లమైంది. 

శాస్త్రవేత్తలు దీనిని ఒక  సాల్టేషన్ వేరియంట్ గా చెబుతున్నారు. అంటే సాధారణంగా వైరస్‌లు నెమ్మదిగా మ్యూటేట్ అవ్వడానికి బదులుగా, ఒకేసారి అనేక జన్యుపరమైన మార్పులతో రూపాంతరం చెందడం అన్న మాట. ఇది JN 1 వంశానికి చెందిన MC.10.1.7 నుంచి ఉద్భవించిందని, దీని స్పైక్ ప్రోటీన్‌లో ప్రత్యేక మార్పులు ఉన్నాయని పరిశోధనలు పేర్కొన్నాయి.

అయితే, ఈ వేరియంట్ కారణంగా గతంలో కంటే ప్రమాదకరమైన ముప్పు పొంచివుందని చెప్పడానికి ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆధారాలు లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు.   జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఇది మానవ కణాల్లోకి సులభంగా ప్రవేశించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, టీకాల ద్వారా తయారైన యాంటీబాడీలను తప్పించుకోలేదు.  అప్‌డేటెడ్ వ్యాక్సిన్లు తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తి దీనిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. 

ఇది కూడా చదవండి: కడపలో కరోనా కలకలం.!?

ఈ కొత్త వేరియంట్‌ సోకిన వారిలో  జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు,  అలసట లక్షణాలు కనిపిస్తాయి. సాధారణ ఫ్లూ లేదా జలుబు లక్షణాలను పోలి ఉండటం వల్ల కేవలం లక్షణాలను బట్టి ఇది ఏ వైరస్ అనేది గుర్తించడం కష్టమని, నిర్ధారణ కోసం పరీక్షలు తప్పనిసరి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ  వెల్లడించింది.

ప్రస్తుతానికి PJ.2.1 వల్ల ఆసుపత్రుల్లో చేరికలు,  మరణాల రేటు వంటి సమాచారం లేదు.    వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.  

మీకు నచ్చవచ్చు: ఏపీలో కరోనా విజృంభణ.. సర్కార్ అలర్ట్.!

ఎల్‌నినో ఎఫెక్ట్: ఆదివాసీలకు 125 రోజుల ఉపాధి పనులు.!

[New COVID Variant Spread Rapid, WHO, Caution, Coronavirus Strain, Global Spread, WHO COVID Update, Saltation Variant, Telugu One]