నెల్లూరు లేడీ డాన్ అరుణ అరెస్టు

 నెల్లూరు లేడీ లేడి డాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేయించడంలో చక్రం తిప్పిన అరుణ హైదరాబాద్ వెళ్తుండగా మేదరమెట్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు. తనను అరెస్టు చేస్తారన్న భయంతో లేడీడాన్ అరుణ నెల్లూరు నుంచి కారులో హైదరాబాద్ కు పరారీ కావడానికి ప్రయత్నించారు.

అయితే ఆమె కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ప్రకాశం జిల్లా మేదరమెట్ట వద్ద కోవూరు పోలీసులు ఆమెను అదుపులోనికి తీసున్నారు.  ఈ సందర్భంగా అరుణ తన కారులో గంజాయి పెట్టి  తప్పుడు కేసులు పెట్టే ప్రమాదం ఉందంంటూ కారులో పడుకుని సెల్ఫీలు తీసుకుని మీడియా, సోషల్ మీడియాకు విడుదల చేశారు. మీడియాయే తనను కాపాడాలంటూ వేడుకుంటే ఆమె ఆ వీడియోలు విడుదల చేశారు.  ఇలా ఉండగా కోవూరులో ఆమెపై ఇప్పటికే ఓ కేసు నమోదై ఉంది. కోవూరులో ఓ ఇల్లు ధ్వంసం కేసులో ఆమె నిందితురాలు. అయితే ఇప్పుడు ఆమెను ఏ కేసులో అరెస్టు చేశారన్నది తెలియాల్సి ఉంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu