సృష్టి కేసులో నమ్రత బెయిల్ పిటిషన్ డిస్మిస్
posted on Aug 16, 2025 12:32PM

తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో డాక్టర్ నమ్రత బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. నమ్రత తప కుమారుడి పెళ్లి ఉందని... అందుకే బెల్ మంజూరు చేయాలంటూ సిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నమ్రత తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆమె కుమారుడి పెళ్లి పత్రికను సైతం కోర్టుకు సమర్పించారు. అయితే.. నమ్రత నుండి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందనీ, నమ్రత ఆస్తులపై విచారణ జరపాల్సి ఉందని పోలీసుల తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అంతే కాకుండా నమ్రత నడిపించిన అక్రమ దందా కంపెనీలపై దర్యాప్తు జరపాల్సి ఉందని, ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్దీ అక్రమాలు బయట పడుతున్నాయని, పోలీసుల తరఫున న్యాయవాది తన వాదనలు కోర్టుకు వినిపించారు. ఈ దశలో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే బయటికి వెళ్లి... సాక్షులను ప్రభావితం చేసే, బెదిరించే అవకాశాలు ఉన్నాయని, అందుచేత నమ్రతకు బెయిల్ మంజూరు చేయ వద్దంటూ పోలీసుల తరఫున న్యాయ వాది కోర్టును కోరారు. వాద ప్రతి వాదనలు విన్న అనంతరం సికింద్రాబాద్ కోర్టు నమ్రత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టి వేస్తూ తీర్పు వెలువరించింది.