మోడీ సంతకంతో పెళ్లి సంబంధాలు

సెలెబ్రెటీస్ కి సాధారణ ప్రజానీకంలో ఉండే క్రేజ్ అంత ఇంత కాదు వారితో ఒక్క సెల్ఫీ కనీసం వారి ఆటోగ్రాఫ్ తీసుకున్న చాలు అని పరితపిస్తుంటారు.ఆలాంటి అవకాశం వస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు,వారిని కూడా ఓ గొప్ప వారిగా భావిస్తుంటారు ప్రజలు.అలాంటి సంఘటనే తాజాగా పశ్చిమ బెంగాల్ లో జరిగింది.

 

 

పశ్చిమ్‌ బంగాలోని మిడ్నాపూర్‌లో జులై 16న ప్రధాని మోదీ సభ జరిగింది. ఆ సభకు సాల్‌గిరా గ్రామానికి చెందిన రీటా మూడీ అనే విద్యార్థిని తన తల్లి, సోదరితో సహా హాజరై అక్కడ టెంట్ కింద కూర్చుంది. అయితే అక్కడ టెంట్ కూలిపోవడంతో వారితో సహా కొంతమంది గాయపడ్డారు. వారిని ప్రధాని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. మోదీ రీటా వద్దకు రాగానే ఆమె ఆయన ఆటోగ్రాఫ్‌ కోరింది. ఆయన నవ్వుతూ ఆరోగ్యంగా ఉండు రీటా మూడీ అని తన ఆటోగ్రాఫ్ ఇచ్చారు.

 

 

అప్పటి నుంచి రీటా సెలబ్రిటీగా మారిపోయారు. ఆటోగ్రాఫ్ చూడటానికి జనాలు రావడం మొదలుపెట్టారు. ‘పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫొటో నాకొచ్చిన ప్రాచుర్యానికి కారణం అనుకుంటా’ అని రీటా వెల్లడించింది. ‘ ఈ సంఘటనలో మా అమ్మాయికి రెండు పెళ్లి సంబంధాలు వచ్చాయి’ అని రీటా తల్లి వెల్లడించింది. ‘నా తల్లిదండ్రులు నిర్ణయించుకున్నప్పుడు నా వివాహం జరుగుతుంది. అప్పటి వరకు నేను చదువుకోవాలనుకుంటున్నా’ అని ఆమె తెలిపింది.