మోడీ హత్యకు ప్లాన్.. సహకరించిన భారత ఉద్యోగి...

 

ఉగ్రవాదులు భారత ప్రధాని నరేంద్ర మోడీని చంపడానికి ప్రయత్నించారా..? అంటే అవుననే చెబుతుంది  జాతీయ దర్యాప్తు సంస్థ. ఈ సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా ఉగ్రవాదులే ఒప్పుకున్నట్టు కూడా సంస్థ అధికారులు తెలుపుతున్నారు. అసలుసంగతేంటంటే.. మధ్యప్రదేశ్ లో ఉజ్జయిన్ పాసింజర్ రైలులో పేలుడుకు కారణమైన ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఉగ్రవాదులు మహ్మద్ డానిష్, ఆతిఫ్ ముజఫర్ తదితరులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా గత సంవత్సరం  నరేంద్ర మోదీ, లక్నోలో ర్యాలీ జరిపిన వేళ, ఆయన్ను హత్య చేసేందుకు రామ్ లీలా మైదానంలో ప్రయత్నించామని..  ఒక రోజు ముందు అక్కడ పడివున్న ఓ చెత్తడబ్బాలో బాంబు  అమర్చామని.. అయితే రెండు రోజుల తరువాత అక్కడికి వెళ్లి చూడగా, బాంబు మాయమై వైర్లు మాత్రమే కనిపించాయని..దాంతో తాము విఫలమయ్యామని ఉగ్రవాదులు చెప్పినట్టు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అంతేకాదు బాంబుల తయారీకి భారత వాయుసేన మాజీ ఉద్యోగి సహకరించాడని ఎన్ఐఏ పేర్కొంది.