మీడియాపై దాడులపై ట్విట్టర్ లో మండిపడ్డ లోకేష్

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలను, ఆరోపణలను ట్విట్టర్ వేదికగా సంధిస్తూనే ఉన్నారు.  సమస్యలు చెబుతున్న ప్రతిపక్షంపై, అలాగే, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్న మీడియాపై ఎదురుదాడికి పాల్పడుతున్నారంటూ లోకేశ్ మండిపడ్డారు. వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని అన్నారు. కాగా, పుచ్చకాయలు సాగు చేసే రైతుల కష్టాలకు సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనంపై మంత్రి కన్నబాబు విమర్శలు చేశారు. దీనిపై లోకేశ్ విమర్శలు చేస్తూ ఓ వీడియోను జతపరిచారు.
దాని లింక్ ఈ దిగువన ఇస్తున్నాం: 
https://twitter.com/naralokesh/status/1253653463566712834

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu