కరోనా నియంత్ర‌ణ‌కు సి.ఎం. చర్యలు తీసుకోవటం లేద‌ట! నారా లోకేశ్ ట్వీట్

దేశమంతా అప్ర‌మ‌త్తంగా వున్నారు. అన్ని రాష్ట్రాలు పాఠశాలలు మూసేస్తున్నాయి. జనాలు గూమికూడకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ ఎటువంటి చర్యలూ తీసుకోవట్లేదని, ప్రజలను రక్షించాలన్న బాధ్యత కన్నా ఆయనకు అధికార దాహమే అధికంగా ఉందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని, ఇందుకు జగన్‌ ఇగోయే కారణమని, మరింత అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఆయన పడుతున్న తపన రాష్ట్ర ప్రజలను రక్షించుకోవాలన్న దాని కంటే అధికంగా ఉందని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ డిసెంబరు చివరి వారంలో చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ విషయంలో భారత్ మొదట్నించి అప్రమత్తత తో ఉన్నప్పటికీ.. ఫిబ్రవరి చివరి.. మార్చి మొదటి వారాల్లో కాస్తంత ఉదాసీనత ప్రదర్శించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే.. ఇప్పటి పరిస్థితి కారణంగా చెబుతున్నారు.

ప్రపంచాన్ని అంతకంతకూ ఆక్రమిస్తున్న ఈ డెడ్లీ వైరస్ తన తీవ్రతను పెంచుతోంది. తాజాగా దేశంలో కరోనాకు గురైన వారి సంఖ్య 147కు చేరుకుంది. ఇప్పటివరకూ 147 మందిలో కరోనా వైరస్ ను గుర్తించగా.. 130 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 14 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయితే.. ముగ్గురు మరణించారు.

వాస్త‌వాల్ని దృష్టిలో పెట్టుకొని రెండు తెలుగురాష్ట్రాల్లో ఈ వైర‌స్ విజృంభించ‌కుండా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు కూడా కోరుకుంటున్నారు.